E-Paper
Advertisement

Lunar Eclipse : గ్రహణం సందర్భంగా చంద్రుడు ఎందుకు ఎరుపెక్కుతాడు?

Lunar Eclipse : గ్రహణం సందర్భంగా చంద్రుడు ఎందుకు ఎరుపెక్కుతాడు?
Advertisement

Lunar Eclipse : గ్రహణాల విషయంలో మనకు ఎన్నో సందేహాలుంటాయి. వాటిని సైన్స్ ఎప్పటికప్పుడు తీరుస్తున్నా… ఇంకా మిగిలే ఉంటున్నాయి. అలాంటి వాటిలో ఒకటి గ్రహణం సందర్భంగా చంద్రుడు ఎందుకు ఎరుపెక్కుతాడు? తెల్లగా మెరిసేపోయే చంద్రుడు సంపూర్ణ గ్రహణం రోజు మాత్రం అరుణ వర్ణంలోకి మారిపోతాడు. ఈ రహస్యం గుట్టు విప్పింది నాసా. ఈ నెల 8న (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఆ రోజు కూడా చందమామ ఎరుపు వర్ణంలో కనిపిస్తాడు. సాధారణంగా దీన్ని రెడ్ మూన్ గా పిలుస్తారు. ఈ ఏడాది వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణాల్లో ఇదే చివరిది. మళ్లీ రెడ్ మూన్ చూడాలంటే 2025 వరకు ఆగాల్సిందే. అలాగని గ్రహణాలు రావని కాదు. పాక్షికమైనవి, పెనుంబ్రల్ చంద్ర గ్రహణాలు మాత్రమే ఉంటాయి.
సంపూర్ణ చంద్రగ్రహణం రోజున విశ్వంలో మరో అద్భుతం కనిపించబోతోంది. అదేంటంటే చంద్రుడు ఎరుపెక్కడం వల్ల ఆకాశంలో కాంతి తగ్గుతుంది. అదే సయమంలో యురేనస్ గ్రహం ప్రకాశవంతంగా మెరుస్తూ మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెబుతోంది నాసా.

చంద్రగ్రహణం అంటే ఏంటి?
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి రావడంతోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డురావడం వల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఫలితంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదే సమయంలో సూర్యుడి రేడియేషన్ నేరుగా భూమిపై పడుతుంది. ఇది మన సాధారణ కంటికి కూడా కనిపించేలా వేవ్ లెంత్ ఉంటుందంటారు శాస్త్రవేత్తలు. అయితే దీని ప్రభావం కళ్లపై ఉంటుంది కాబట్టి డైరెక్టుగా చూడకూడదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

చంద్రుడు ఎరుపు రంగులోకి ఎలా మారుతాడు?
ఆకాశం నీలం రంగులో కనిపించడం, సూర్యాస్తమయం ఎరుపువర్ణంలో అగుపించడానికి ఇదే సూత్రం వర్తిస్తుందంటోంది నాసా. సంపూర్ణ చంద్రగ్రహణం రోజున చంద్రుడు ఎరుపువర్ణంలో కనిపించడానికి సేమ్ ఇదే ఫార్ములా వర్తిస్తుందని చెబుతోంది నాసా. దీన్ని రేలేగా పిలుస్తారు. కాంతి అనేది తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. కాంతిలోని వివిధ రంగులు వేర్వేరు భౌతిక లక్షణాలను కలిగివుంటాయి. ఇందులో నీలికాంతి తరంగదైర్ఘ్యం తక్కువగా ఉంటుంది. అందుకే భూవాతావరణంలోని కణాల ద్వారా నీలిరంగు కాంతి చాలా తేలిగ్గా చెల్లాచెదురవుతుంది. అందుకే ఆకాశం నీలం రంగులో కనిపిస్తోందంటోంది నాసా. ఇక ఎరుపు కాంతి తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. అది చాలా దూరం ప్రయాణిస్తుంది. అందుకే సూర్యాస్తమయం, చంద్రగ్రణాలు ఎరుపు వర్ణంలో కనిపించడానికి కారణమవుతున్నాయని నాసా తన వెబ్ సైట్లో వెల్లడించింది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×