Wife-Husband : భర్త చేసే అన్ని కార్యాలలోను భార్య ఎడమ వైపు పక్కనే ఉండాలని లేదు. కొన్ని ధార్మిక విషయాల్లో మాత్రమే ఈ పద్ధతి ఉంటుంది. అభిషేక కార్యక్రమాలలో , ప్రయాణాలలో ఒకే మంచం మీద నిద్రించేటప్పుడు, పుణ్యస్నాన సమయంలోనూ , ధానధర్మాలు చేసే సమయంలోనూ , భార్య భర్తకు ఎడమ వైపు ఉండాలి. వివాహ సమయంలో కన్యాదానం చేసేటప్పుడు , విగ్రహ ప్రతిష్ట, యజ్ఞయాగాల సమయాలలో భార్య, భర్తకు కుడివైపు ఉండాలి అనేది శాస్త్ర నియమం.
సృష్టికర్త బ్రహ్మ తాను సృష్టించినప్పుడు తన కుడి భాగం నుంచ పరుషుడ్ని, ఎడమ భాగం నుంచి మహిళను సృష్టించాడట. బైబిల్ లో కూడా స్త్రీని ఎడమ వైపు గుండె ఎముక నుండి పురుషుని కుడివైపు గుండె నుంచి దేవుడు సృష్టించాడని చెప్పబడింది . అన్ని మతాలు కూడా సృష్టి విషయంలో ఒక రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటం విశేషం. పురుషునికి ఎడమవైపు గా స్త్రీ ఉండాలని చెప్పడటంలో ఒక సున్నితమైన రహస్యం ఉంది. పురుషుని గుండె ఉండేది ఎడమవైపుననే కదా.. అర్ధాంగి అయిన స్త్రీని తన హృదయ భాగాన నిలుపుకోవాలని శాస్త్రం చెబుతోందన్నమాట. శ్రీ మహా విష్ణువు కూడా లక్ష్మీదేవిని తన ఎడమ భాగాన దాచుకొన్నాడట. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఒకే రూపంగా ఒకరిలో ఒకరు లీనమై ఉంటారు కదా. పరమేశ్వరునిలో ఎడమ భాగమంతా పార్వతీ దేవి లీనమై ఉంటుంది.
మనిషి స్పందనకూ సాన్నిహిత్యాన్నికి జీవిత వికాసానికి ఎడమ భాగం పనిచేస్తుంది. కాబట్టి స్త్రీని ఎడమ వైపుగా ఉంచుకోవడం ఎంతో సముచితం కూడా. మనిషి కుడి ఎడమ భాగాలకు వ్యత్యాసం ఉంటుంది. కుడి భాగంలోని అవయవాలు అన్నీ ధృడంగా బలంగా కష్టించడానికి అనుకూలంగా ఉంటాయి. ఎడమ భాగంలోని అవయవాలు అన్నీ కూడా సుకుమారంగానూ సహాయ స్థితినికలిగినవిగా ఉంటాయి.
మనం తినే ఆహారన్ని ఎక్కువగా నమిలి కష్టపడేదికుడి వైపు దవడ దంతాలు మాత్రమే. ఇది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. పురుషులిద్దరూ ఒకే మంచంపై పడుకున్నప్పుడు పురుషుడు తన కుడి చేతిని స్త్రీ మీద వేసి నిద్రలో కూడా ఆమెను రక్షించుకుంటూ నిద్రబోతాడు. ఇవన్నీ మనకు తెలియకుండానే అప్రయత్నంగా జరుగుతుంటాయి. అందుకే ఆమె అర్ధాంగి. పురుషుడి ఎడమభాగం స్త్రీ అంటున్నది శాస్త్రం.