E-Paper
Advertisement

WIPRO: ఉద్యోగులకు షాక్.. 452 మందికి ఉద్వాసన

WIPRO: ఉద్యోగులకు షాక్.. 452 మందికి ఉద్వాసన
Advertisement

WIPRO: టెక్ దిగ్గజం విప్రో సంచలన నిర్ణయం తీసుకుంది. పనితీరు బాగోలేని ఫ్రెషర్లకు షాక్ ఇచ్చింది. మొత్తం 452 మందిని తొలగించింది. పని తీరు సరిగా కనబరచకపోవడంతోనే వారిపై వేటు వేసినట్లు విప్రో ప్రకటించింది. శిక్షణ తర్వాత కూడా వారికి సమయం ఇచ్చామని.. అయినా కూడా వారు పనితీరు మెరుగుపరుచుకోకపోవడంతో ఇంటికి సాగనంపామని వెల్లడించింది.

వర్క్ విషయంలో ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తామని విప్రో తెలిపింది. ఈ నియమం ఫ్రెషర్లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక మూడో త్రైమాసికంలో కొత్తగా 600 మందిని చేర్చుకోనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులోనూ నియామకాలను కొనసాగిస్తామని తెలిపింది.

Advertisement

ఇక కొంతకాలంగా ఆర్థిక మాంద్యం వల్ల ఐటీ రంగంలో గందరగోళం నెలకొంది. దిగ్గజ కంపెనీలు సైతం మాంద్యం దెబ్బకు దివాలా తీస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ కూడా దాదాపు 11 వేల మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఐటీ ఉద్యోగుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియక అయోమయం అవుతున్నారు.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×