BigTV English

Gobi Manchuria Banned : గోబీ మంచూరియా బ్యాన్..!

Gobi Manchuria Banned : గోబీ మంచూరియా బ్యాన్..!

Gobi Manchurian Banned : చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి మంచూరియా తింటే.. అబ్బా ఆ ఫీలింగే వేరు. అందులోనూ గోబీ మంచూరియా ఉంటే మరింత ఎంజాయ్. ఈ మంచురియా లవర్స్ ఎక్కువగానే ఉంటారు. దీన్ని చూస్తే తినకుండా ఉండలేరు. అయితే గోబీ మంచూరియా ఇక నుంచి గోవాలోని మపూసా ప్రాంతంలో కనిపించదట. మంచూరియా తయారీని పూర్తిగా నిషేధించారు. బ్యాన్ ఎందుకు చేశారని టెన్షన్ పడుతున్నారా? అయితే ఇది చూడండి..


మంచూరియాల యందు గోబీ మంచూరియా వేరయా.. అన్నట్లుగా గోవాలోని మపూసా ప్రాంతంలో గోబీ మంచూరియాను అధికంగా తింటారు. మపూసా ప్రాంతంలో గోబీ మంచూరియా తయారీ, విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే మంచూరియా తయారీ అపరిశుభ్రంగా ఉంటడం, తయారీలో ప్రమాదకరమైన రంగులు వాటడం గుర్తించి బ్యాన్ చేశారు.

గోబీ మంచూరియాలో వాడే సింథటిక్ రంగులు, దాని అపరిశుభ్రమైన వాతావరణంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకు నుంచి ఫుడ్ స్టాల్స్, ఫంక్షన్స్ లోని గోబీ మంచూరియా తయారీ ఇక ఉండదు. ఇది వరకు గోబీ మంచూరియాను మపుసా నగరం, మోర్ముగాన్ నగరాల్లో ఈ మంచూరియాను నిషేధించని విషయం తెలిసిందే.


గోబీ చరిత్ర

గోబీ మంచూరియా చాలా ప్రజాదారణ పొందిన వంటకం. ముంబైకి చెందిన చైనీస్ పాక శాస్త్రనిపుణుడు నెల్సన్ వాంగ్ ఈ వంటకాన్ని మొదటగా ప్రవేశపెట్టాడు. 1970లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో క్యాటరింగ్ చేస్తున్నప్పుడు చికెన్ మంచూరియాను తయారు చేశాడు. అందులో చికెన్, కార్న్‌ఫ్లోర్, సోయాసాస్, వెనిగర్, టమోటా సాస్ వంటివి ఉపయోగించి సర్వ్ చేశాడు. శాఖాహార ప్రియులకు ఆ లోటు భర్తీ చేసేలా ఈ స్థానంలో గోబీ మంచూరియాను తీసుకొచ్చాడు.

గుజరాత్‌‌లోని పాలిటానా పూర్తి శాఖాహార పట్టణం. ఇక్కడ జైనుల పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. వారు శాఖాహారులు కాబట్టి ఈ ప్రాంతంలో నాన్ వెజ్ తయారీ, విక్రయాలను పూర్తిగా బ్యాన్ చేశారు.

ఫాస్ట్‌ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరమని మన అందరికీ తెలుసు. అయినప్పటికీ పిజ్జాలు, బర్గర్లు, కూల్‌డ్రింక్స్ తాగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. జంక్ ఫుడ్‌ను పంజాబ్, రాజస్థాన్‌లోని కొన్ని పాఠశాలలు, కళాశాలల వద్ద నిషేధించారు.

ఎనర్జీ డ్రింక్‌గా పిలవబడే రెడ్‌బుల్‌ను మన దేశంలో అధికంగా తాగుతున్నారు. ఈ రెడ్‌బుల్‌ను ఫ్రాన్స్, డెన్మార్క్, లిథువేనియా దేశాల్లో బ్యాన్ చేశారు. దీని వల్ల గుండె సమస్యలు, హైబీపీ,డిప్రెషన్ వంటివి వచ్చే అవకాశం ఉందని అక్కడ ప్రభుత్వాలు తేల్చాయి.

కిండర్‌జాయ్.. ఇదంటే పిల్లలకి ఎంత ఇష్టమో. అది కనిపిస్తే చాలు పిల్లలు కొనేంత వరకు గోలగోల చేస్తారు. ఈ కిండర్‌జాయ్‌ని అమెరికాలో పూర్తిగా బ్యాన్ చేశారు. దీనిలో ఉండే చాక్లెట్ బాల్స్ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చీజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దోశ దగ్గర నుంచి పిజ్జా వరకు అన్నిటిపై చీజ్ వేసుకొని తినడం ఇప్పుడు ట్రెండ్. అయితే ఆస్ట్రేలియా, నార్వే దేశాల్లో చీజ్‌‌పై బ్యాన్ విధించారు. దీనికి కారణం వీటిపై వాడే రంగులని ప్రభుత్వాలు చెప్పాయి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×