Chapati Recipe: మనం ఇంట్లో ప్రతిరోజూ తినే వంటకాలతోనే స్వీట్స్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అందులో ఒకటి చపాతి. అవును మీరు విన్నది నిజమే. పొద్దున చేసిన చపాతీలు రాత్రికి లేదా మరుసటి రోజుకి మిగిలిపోతుంటాయి. చాలా మంది అవి గట్టిపడతాయి అని, రుచి ఉండదని పారేస్తుంటారు. అంతెందుకు మనం కూడా అలా చాలా సార్లు చేసే ఉంటాము. కానీ ఆ చపాతీలను పారేయకుండా ఒక చక్కని తీపి వంటకం చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును, మిగిలిపోయిన చపాతీలతో ఒక అద్భుతమైన స్వీట్ తయారుచేయొచ్చు. అది రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ఎలా చేయాలి?
పొద్దున్నా చేసిన చపాతీలను రాత్రి ఫ్రిజ్‌లో పెట్టేస్తే మరుసటి రోజు అవి కొంచెం పొడిగా మారుతాయి. ఆ చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఆ పొడి మనకు హల్వా తయారీకి బేస్‌లా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక చపాతీ పొడిని వేసి కొద్దిసేపు వేయించాలి. ఆ వాసన రాగానే అందులో పాలు వేసి బాగా కలపాలి. కొద్దిగా చక్కెర వేసి మిశ్రమం గట్టిపడేవరకు కలుపుతూ ఉంచాలి. చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కాజూ, బాదం, కిస్మిస్, యాలకుల పొడి వేసి కలిపితే చపాతీ హల్వా సిద్ధం అవుతుంది.
Also Read: Honda Gold Wing 2025: హోండా గోల్డ్ వింగ్ 2025.. లగ్జరీతో పవర్‌ను కలిపిన అమెరికన్ టూరింగ్ బైక్!
ఈ హల్వా రుచి సాధారణంగా చేసుకునే రవ్వ హల్వా, బెల్లం హల్వా లాంటిదే కానీ, గోధుమ రుచితో మరింత ప్రత్యేకంగా ఉంటుంది. పిల్లలకు ఇచ్చినా, వారు ఇది చపాతీతో చేసిందే అని గుర్తించరు. చపాతీలో ఉండే గోధుమ పిండి వల్ల శరీరానికి శక్తి, ఫైబర్ లభిస్తుంది. పాలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్ కలిసిపోవడంతో ఇది శక్తివంతమైన తీపి ఆహారంగా మారుతుంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి గాని, సాయంత్రం టీతో గాని తింటే తృప్తిగా ఉంటుంది.
దీన్ని మరో విధంగా కూడా వాడొచ్చు!
అదే మిశ్రమాన్ని వేరే రీతిలో వాడాలనుకుంటే చపాతీ లడ్డూలుగా చేసుకోవచ్చు. చపాతీ పొడిలో బెల్లం పొడి, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలిపి చేత్తో చిన్న చిన్న బంతుల్లా చేసుకుంటే చక్కని లడ్డూలు సిద్ధమవుతాయి. ఇవి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ లడ్డూలు తినడానికి రుచిగా ఉండడమే కాదు, శరీరానికి శక్తి కూడా ఇస్తాయి.
చపాతీ హల్వా లేదా లడ్డూ చేసేప్పుడు ఒక జాగ్రత్త మాత్రం తప్పక పాటించాలి. చపాతీలు రెండు రోజులకు మించి ఉంటే వాటిని పడేయాలి. వాసన ఉండకూడదు. ఫ్రిజ్‌లో పెట్టినవైతే బయటకు తీసి రూం టెంపరేచర్‌కి వచ్చాక వాడాలి. పాలు వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచకూడదు, లేకపోతే రుచి మారిపోతుంది. అటువంటి వాటిని పడేయడం మంచిది. అయితే, ఇకపై మిగిలిన చపాతీలు కనిపిస్తే, అవి వృధా అవ్వాలనే ఆలోచన వద్దు. వాటితో ఒక తీపి వంటకం తయారుచేసి అందరినీ రుచి చూపించండి. చపాతీతో హల్వా, లడ్డూ ఇవి రుచి, ఆరోగ్యం, ఆర్థికంగా మేలు చేస్తాయి. మూడు ఒక్కసారిగా అందించే చక్కని ఇంటి తీపి వంటకం ఎవరు ఇష్టపడరు చెప్పండి.