BigTV English

Akhanda 2: కళ్ళుచెదిరే ధరకు అఖండ 2 థియేట్రికల్ హక్కులు.. బాలయ్యా.. మజాకా!

Akhanda 2: కళ్ళుచెదిరే ధరకు అఖండ 2 థియేట్రికల్ హక్కులు.. బాలయ్యా.. మజాకా!

Akhanda 2:నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna)ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ.. అందులో మాస్ యాక్షన్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రం అఖండ(Akhanda). ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ 2: తాండవం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల డిసెంబర్ 5న ఈ సినిమాను దింపబోతున్నారు.


బాలయ్య మూవీకి భారీ బిజినెస్..

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తాజాగా భారీ ధరకు థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అఖండ 2: తాండవం సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.240 కోట్లకు క్లోజ్ అయింది. ఈ విషయం తెలిసిన అభిమానులు బాలయ్యా.. మజాకా.. విడుదలకు ముందే భారీ బిజినెస్ జరుపుకున్నారు. ఈ సినిమా విడుదలయ్యాక కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే బాలయ్య మూవీకి అప్పుడే ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు.

ALSO READ:Peddi Movie: పెద్దిలో స్పెషల్ సాంగ్.. ఆ యువరాణి కోసం ఫాన్స్ డిమాండ్!


ఏరియా వైజ్ బిజినెస్..

ఈ సినిమాను తెలంగాణ (నైజాం) రూ.36కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.55 కోట్లు, సీడెడ్ (రాయలసీమ)లో రూ.24 కోట్లు.. నార్త్ అమెరికా ఓవర్సీస్ రైట్స్ కలిపి రూ.31 కోట్లకి అమ్ముడుపోయాయి. అలా మొత్తంగా థియేట్రికల్ గా బాలయ్య కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ రూ.146 కోట్లు చేసింది. అటు ఓటీటీ హక్కులు రూ.104 కోట్లు 5 భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్.. శాటిలైట్ రూ.60 కోట్లు.. ఇలా భారీ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య కెరియర్..

బాలయ్య కెరియర్ విషయానికొస్తే.. ఒకవైపు హీరోగా మరొకవైపు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యేగా ఏకంగా మూడుసార్లు గెలిచి తన సత్తా ఏంటో చాటారు. హిందూపురం ప్రజలలో నాయకుడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు బాలయ్య. ఇదిలా ఉండగా మరొకవైపు హోస్ట్గా వ్యవహరిస్తూ ఊహించని పాపులారిటీ దక్కించుకున్నారు. అన్ స్టాపబుల్ విత్ బాలయ్య కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తూ ఈ షోతో ఇండియా నంబర్ వన్ టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకున్న షోగా పేరు దక్కించుకుంది. ఇలా బాలయ్య ఈ వయసులో కూడా కష్టపడుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు బసవతారకం హాస్పిటల్ తో పేదవారికి ఉచిత వైద్య అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.

Related News

Mithra Mandali: ఆరు రోజుల్లో రిలీజ్.. ఇంకా షూటింగ్‌ జరగడమేంటి భయ్యా..!

Teja Sajja -Karthik : మిరాయ్ కాంబో రిపీట్.. సీక్వెల్ అయితే కాదండోయ్

Srikanth Iyengar : గాంధీపై నటుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు.. సైబర్ క్రైమ్‌లో ఎమ్మెల్సీ ఫిర్యాదు..

Rashmika – Vijay: హమ్మయ్య.. ఎంగేజ్మెంట్‌ని అఫిషియల్‌గా ప్రకటించిన రష్మిక.. పెళ్లి తేదీ ఫిక్స్!

Karva chauth: సెలబ్రిటీల ఇంట ఘనంగా కర్వాచౌత్.. మెగా కోడలు మొదలు రకుల్ వరకు!

Kollywood Director : రిషబ్ శెట్టికి మరో జాతీయ అవార్డు.. కాంతార చాప్టర్ 1 పై డైరెక్టర్ కామెంట్స్..

Peddi Movie: పెద్దిలో స్పెషల్ సాంగ్.. ఆ యువరాణి కోసం ఫాన్స్ డిమాండ్!

Big Stories

×