BigTV English

Karva chauth: సెలబ్రిటీల ఇంట ఘనంగా కర్వాచౌత్.. మెగా కోడలు మొదలు రకుల్ వరకు!

Karva chauth: సెలబ్రిటీల ఇంట ఘనంగా కర్వాచౌత్.. మెగా కోడలు మొదలు రకుల్ వరకు!

Karva chauth:హిందువుల ముఖ్యమైన పండుగలలో కర్వాచౌత్ ఒకటి. అయితే ఇది ఎక్కువగా దక్షిణాది హిందువులకు తెలియదు. ఉత్తర భారత దేశంలో ఉండే హిందువులే ఈ కర్వాచౌత్ ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అయితే కర్వాచౌత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. పెళ్లయిన మహిళలు తమ భర్తలు దీర్ఘాయుష్షుతో ఉండాలి అని వాళ్ళ శ్రేయస్సు, ఆరోగ్యం కోసం ఈ కర్వాచౌత్ ను చేసుకుంటారు. ఈ కర్వాచౌత్ ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్థి తిథినాడు వస్తుంది. అలా ఈ ఏడాది కర్వాచౌత్ అక్టోబర్ 10 న వచ్చింది. ఈ కర్వాచౌత్ పూజ చేసుకునే వివాహితలు ఆరోజు సూర్యోదయం నుండి నిర్జల వ్రతం పాటిస్తారు. ఈ వ్రతం స్టార్ట్ చేసే ముందు వాళ్ళ అత్తగారు ఇచ్చే సర్గీ తో వ్రతం మొదలుపెడతారు. ఆరోజు సాయంత్రం పూట సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు ధరించి గౌరీ మాతని పూజించి కర్వాచౌత్ కథను వింటారు. అలాగే చంద్రుడిని జల్లెడలో చూసి ఆ తర్వాత అదే జల్లెడలో భర్త మొహాన్ని చూస్తారు. ఆ తర్వాత భర్త చేతుల మీదుగా ఆహారం తీసుకొని ఉపవాసాన్ని విరమిస్తారు. ఉత్తరాది ప్రజలు ఎంతో గ్రాండ్గా చేసుకునే ఈ కర్వాచౌత్ వేడుకలను చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా చేసుకుంటారు. మరి ఈ ఏడాది కర్వాచౌత్ వేడుకలను ఎవరెవరు చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం.


భర్తతో లావణ్య త్రిపాఠి..

ఈ ఏడాది కర్వాచౌత్ వేడుకలు కేవలం ఉత్తర భారత దేశ సెలబ్రిటీలు మాత్రమే కాదు సౌత్ సెలెబ్రెటీలు కూడా కొంతమంది చేసుకున్నారు. అలాంటి వారిలో లావణ్య త్రిపాఠి కూడా ఒకరు. ఈ ఏడాది లావణ్య త్రిపాఠి తన భర్త వరుణ్ తేజ్ (Varun tej) తో కలిసి కర్వాచౌత్ వేడుకలను చేసుకుంది. జల్లెడలో వరుణ్ మొహం చూస్తున్న ఫోటోని షేర్ చేయడంతో పాటు..” నా చేతుల్లో ఆయన ప్రేమ.. మా చేతుల్లో బిడ్డ.. ఈ కర్వాచౌత్ ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

రకుల్ కర్వాచౌత్ వేడుకలు:

సౌత్ నార్త్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఏడాది తన భర్త జాకీ భగ్నానీ(Jockey bhagnani) తో కలిసి కర్వాచౌత్ వేడుకలను చేసుకుంది. సంప్రదాయమైనటువంటి ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని.. కర్వాచౌత్ వేడుకలను ఘనంగా జరుపుకుంది.


ఫ్యామిలీతో శిల్పా శెట్టి:

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ఘనంగా కర్వాచౌత్ వేడుకలను జరుపుకుంది.

కాజల్ కర్వాచౌత్ వేడుకలు :

హీరోయిన్ కాజల్ కూడా కర్వాచౌత్ వేడుకలను గ్రాండ్గా చేసుకుంది. ఈ కర్వాచౌత్ వేడుకలలో కాజల్ అగర్వాల్ రెడ్ కలర్ శారీలో మెరిసింది.

ప్రెగ్నెన్సీతో పరిణితి కర్వాచౌత్:

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా కూడా భర్తతో కలిసి కర్వాచౌత్ వేడుకలను చేసుకుంది. ఈసారి వీరికి ఈ పండగ స్పెషల్ అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ప్రస్తుతం పరిణితి ప్రెగ్నెంట్.

ప్రియాంక చోప్రా కర్వాచౌత్ వేడుకలు:

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా తన బిజీ షెడ్యూల్ మధ్య కర్వాచౌత్ వేడుకలను జరుపుకుంది. భర్తతో కలిసి కర్వాచౌత్ వేడుకలను జరుపుకున్న ప్రియాంక చోప్రా ఎన్నో పర్యటనల మధ్యలో ఈ ఏడాది కూడా కర్వాచౌత్ జరుపుకోవడానికి నాన్నగారు ఇంటికి వచ్చారు అంటూ తన కూతురికి చెబుతున్నట్లుగా భర్త గురించి క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు నా నిజమైన చాంద్ గా ఉన్నందుకు ధన్యవాదాలు.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ తన భర్త పై ఉన్న ప్రేమని రాసుకువచ్చింది. ఇలా చాలామంది సెలబ్రిటీలు కర్వాచౌత్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నారు.

 

also read:Akhanda 2: కళ్ళుచెదిరే ధరకు అఖండ 2 థియేట్రికల్ హక్కులు.. బాలయ్యా.. మజాకా!

Related News

Rashi Khanna: ప్రేమలో నటి రాశి ఖన్నా..ఒకటి కాదు ఏకంగా రెండు లవ్ స్టోరీలు!

Priyanka Arul Mohan:  పద్ధతి మార్చుకోండి.. హాట్ ఫోటోలపై ఫైర్ అయిన ప్రియాంక మోహన్!

Allu Arjun – Atlee : అదో కొత్త ప్రపంచం… AA22 మూవీ స్టోరీపై క్లూ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ

Mithra Mandali: ఆరు రోజుల్లో రిలీజ్.. ఇంకా షూటింగ్‌ జరగడమేంటి భయ్యా..!

Teja Sajja -Karthik : మిరాయ్ కాంబో రిపీట్.. సీక్వెల్ అయితే కాదండోయ్

Srikanth Iyengar : గాంధీపై నటుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు.. సైబర్ క్రైమ్‌లో ఎమ్మెల్సీ ఫిర్యాదు..

Rashmika – Vijay: హమ్మయ్య.. ఎంగేజ్మెంట్‌ని అఫిషియల్‌గా ప్రకటించిన రష్మిక.. పెళ్లి తేదీ ఫిక్స్!

Big Stories

×