Padi Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్ సమావేశంలో.. పాడి కౌషిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వర్గ రాజకీయాలు ముదిరిపోయాయని.. కానీ బీఆర్‌ఎస్‌లో మాత్రం ఒక్కటే వర్గం కేసీఆర్ వర్గం అని కౌషిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కౌషిక్ రెడ్డి తన ప్రసంగంలో.. సొంత పార్టీనేతలను టార్గెట్ చేస్తూ.. నా గెలుపు కోసం మీరు పనిచేశారు. ఇప్పుడు మీ గెలుపు కోసం నేను పనిచేస్తాను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీనేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ పరంగా నియమాలను ఖచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ నుండి గెలిచి వేరే పార్టీలో చేరితే వారి ఇంటి పై వెయ్యి మందితో దాడి చేయిస్తానన్నారు. అమ్మతోడు ఒట్టు వేసి చెబుతున్న తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. హుజూరాబాద్ నియోజక వర్గంలోని ఐదు మండలాల కార్య కర్తలకు కౌషిక్ రెడ్డి హుకుం జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్థానిక రాజకీయ నాయకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రసంగాన్ని కొందరు తప్పుపడుతున్నారు. మరికొందరు ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే.. అవి సరైన విధంగా అడ్డుకోవాలని కౌషిక్ రెడ్డి హెచ్చరించారని అంటున్నారు.
Also Read: నెల్లూరులో బస్సు బోల్తా.. స్పాట్‌లోనే 46 మంది
కాగా.. పాడి కౌశిక్ రేడిపై గతంలో అరెస్టులు, పోలీసు కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఉన్న కేసుల వివరాలు పబ్లిక్ డొమేఇన్‌లో ఉన్నవని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.