Rohit Sharma Angry: టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కోపం కట్టలు తెంచుకుంది. తన సొంత సెక్యూరిటీపైనే రోహిత్ శర్మ చాలా సీరియస్ అయ్యారు. కొంచెమైనా మీకు బుద్ధుందా ? అంటూ మండిపడ్డారు. రోహిత్ శర్మ నిన్న అంటే శుక్రవారం రోజున ముంబైలోని శివాజీ పార్క్ లో ప్రాక్టీస్ చేసేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోహిత్ శర్మ వైపుగా ఓ 10 ఏళ్ల కుర్రాడు దూసుకు వచ్చాడు. తన అభిమాన క్రికెటర్ అక్కడ ఉన్న నేపథ్యంలో వేగంగా వచ్చాడు కుర్రాడు. ఇది చూసిన రోహిత్ శర్మ సెక్యూరిటీ, వెంటనే ఆ కుర్రాన్ని ఆపేసింది. ఇది చూసిన రోహిత్ శర్మ చాలా సీరియస్ అయ్యారు. అతని వదిలేయండి అని వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు రోహిత్ శర్మ. తన వన్డే కెప్టెన్సీ తొలగించినప్పటికీ ఏమాత్రం తగ్గేది లేదంటూ రంగంలోకి దిగుతున్నాడు. ఇందులో భాగంగానే ముంబైలోని శివాజీ పార్క్ లో నిన్నటి రోజున దాదాపు 5 గంటల పాటు ప్రాక్టీస్ చేశాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో శివాజీ పార్క్ నిండా అభిమానులు వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనాలు కనిపించారు. అదే ఢిల్లీలో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో జనాలు లేరు కానీ, రోహిత్ శర్మ ప్రాక్టీస్ చూసేందుకు ఎక్కువ మంది అభిమానులు వచ్చారు. ఇది ఒక్కటి చాలు రోహిత్ శర్మ క్రెడిబిలిటీ ఏంటి అనేది నిరూపించడానికి ! ఇక రోహిత్ శర్మను చూసిన అభిమానులు, సెల్ఫీలు అలాగే ఆటోగ్రాఫ్ లు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ముంబైలోని శివాజీ పార్క్ లో ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ శర్మ ( Rohit Sharma), తన కారునే బద్దలు కొట్టేసాడు. ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో ఓ భారీ సిక్సర్ బాదాడు రోహిత్ శర్మ. ఇక ఆ బంతి నేరుగా వెళ్లి రోహిత్ శర్మకు సంబంధించిన లంబోర్ఘిని కారుకు తగిలింది. దీంతో కారు అద్దాలు పగిలినట్లు చెబుతున్నారు. ఇక ఈ లంబోర్గిని కారు ధర దాదాపు రూ.4.5 కోట్లు ఉండే ఛాన్సు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కారు ధ్వంసం కావడంతో, తీవ్ర నిరాశకు గురయ్యాడు. కాగా, ఇటీవలే టెస్లా వై మోడల్ కారు రోహిత్ శర్మ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కారులో ముంబైలో జరిగిన సియోట్ అవార్డుల వేడుకకు వచ్చాడు.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
A security guard stopped a kid a bit too harshly, Rohit immediately intervened and asked him to let the kid come. 🥹🤌🏻
Truly Ro is one of the kindest souls. ❤️
— Rohan💫 (@rohann__45) October 10, 2025