OTT Movies : ప్రతివారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. శుక్రవారం కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకుంటాయి. ఈవారం అన్ని సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువ ఉన్నాయి. తెలుగు తో పాటుగా మిగిలిన భాషల్లో కూడా కొత్త సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి వచ్చేసాయి. ఈ వీకెండ్ కూడా కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చిన ఈ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఆసక్తి రేపుతున్నాయి.. అవేంటో ఒకసారి చూసేద్దాం..
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం వార్ 2.. థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అక్టోబర్ 9న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకొని ఈ సినిమా ఇక్కడ మాత్రం భారీగా వ్యూస్ ని అందుకున్నట్లు తెలుస్తుంది.
తేజా సజ్జ హనుమన్ సినిమాతో భారీజాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. ఆ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో మూవీ చేస్తారని జనాలు ఆసక్తిగా ఎదురు చూశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ మూవీలో నటించారు. థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీ ఈనెల 10 ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా మంచి వ్యూస్ ని రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఉదయభాను, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన తాజా మూవీ త్రిబాణధారి బార్బరిక్.. చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నిధి కనిపించకుండా పోవడంతో, వృద్ధుడైన శ్యామ్ పోలీసుల సహాయం కోరతాడు. సరైన ఆధారాలు దొరకకపోవడంతో ఫలితం లేదని అనుకున్న ఆయన స్వయంగా వెతుకుతాడు.. ఇది స్టోరీ.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
డిమాంటే కాలనీ 2 తర్వాత అరుణ్ నిధి నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ రాంబో.. ఈ మూవీ థియేటర్లలోకి కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది..
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన యానిమేషన్ మూవీ కురుక్షేత్ర సీజన్ వన్.. మహాభారత యుద్ధ నేపథ్యంలో సాగే సిరీస్ ఇది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది..
Also Read :రిషబ్ శెట్టికి మరో జాతీయ అవార్డు.. కాంతార చాప్టర్ 1 పై డైరెక్టర్ కామెంట్స్..
మొత్తం ఎనిమిది సినిమాలు వరకు ఈ వీకెండు డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేసాయి. అందులో మిరాయ్, వార్ 2 కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇక థియేటర్లోకి వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీపావళికి బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఆ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి..