BigTV English

Kollywood Director : రిషబ్ శెట్టికి మరో జాతీయ అవార్డు.. కాంతార చాప్టర్ 1 పై డైరెక్టర్ కామెంట్స్..

Kollywood Director : రిషబ్ శెట్టికి మరో జాతీయ అవార్డు.. కాంతార చాప్టర్ 1 పై డైరెక్టర్ కామెంట్స్..

Kollywood Director : కన్నడ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒకటే మాట వినిపిస్తుంది కాంతార చాప్టర్ 1.. కన్నడ డైరెక్టర్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాంతార.. ఈ మూవీ గతంలో భారీ విషయాన్ని సొంతం చేసుకుంది.. ఆ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. దసరా సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం మాత్రమే కాదు.. అటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పలువురు డైరెక్టర్లు రిషబ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. తాజాగా ఓ కోలీవుడ్ డైరెక్టర్ కూడా కాంతార మూవీ పై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..


కాంతార పై అట్లీ ప్రశంసలు..

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన కాంతారా సినిమాతో హీరోగా తనలోని టాలెంట్ నిరూపించుకున్నారు. డైరెక్టర్ గా కూడా ఆయనే చెయ్యడంతో ఒక్కసినిమాతో వరుస రికార్డులను బ్రేక్ చేశాడు. సీక్వెల్ గా వచ్చిన సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో రిషబ్ శెట్టి ని అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా 700 కోట్ల క్లబ్ లోకి చేరింది. తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ అట్లీ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఈ సినిమాకు కచ్చితంగా మరో జాతి అవార్డు వస్తుందంటూ ప్రశంసలు కురిపించాడు. కాంతారలో నటించడమే కాకుండా దర్శకుడిగా పనిచేయడం అంటే సాధారణమైన విషయం కాదు. మరోకరికి ఇది సాధ్యం కాదని ఒక దర్శకుడిగా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాకు మరోసారి జాతి అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నాను అంటూ ఆయన అన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Also Read : శ్రీలీలకు గోల్డెన్ ఆఫర్.. క్రేజీ హీరో సినిమాలో ఛాన్స్..


అట్లీ సినిమాల విషయానికొస్తే.. 

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. పుష్ప 2 తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఈయన కాంబోలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ కథనంతో పాటుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. డిఫరెంట్ జోనల్లో రాబోతున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత మళ్లీ సుకుమార్ తో పుష్ప 3 మూవీ చెయ్యబోతున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Related News

Mithra Mandali: ఆరు రోజుల్లో రిలీజ్.. ఇంకా షూటింగ్‌ జరగడమేంటి భయ్యా..!

Teja Sajja -Karthik : మిరాయ్ కాంబో రిపీట్.. సీక్వెల్ అయితే కాదండోయ్

Srikanth Iyengar : గాంధీపై నటుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు.. సైబర్ క్రైమ్‌లో ఎమ్మెల్సీ ఫిర్యాదు..

Rashmika – Vijay: హమ్మయ్య.. ఎంగేజ్మెంట్‌ని అఫిషియల్‌గా ప్రకటించిన రష్మిక.. పెళ్లి తేదీ ఫిక్స్!

Karva chauth: సెలబ్రిటీల ఇంట ఘనంగా కర్వాచౌత్.. మెగా కోడలు మొదలు రకుల్ వరకు!

Akhanda 2: కళ్ళుచెదిరే ధరకు అఖండ 2 థియేట్రికల్ హక్కులు.. బాలయ్యా.. మజాకా!

Peddi Movie: పెద్దిలో స్పెషల్ సాంగ్.. ఆ యువరాణి కోసం ఫాన్స్ డిమాండ్!

Big Stories

×