Banana With Milk: అరటి పండు, పాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. ఇదిలా ఉంటే.. వాటిని కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఉదయం లేదా సాయంత్రం పాలు, అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అంతే కాకుండా రోజంతా శరీరానికి ఉత్సాహం ఉంటుంది. ఈ కలయిక పిల్లలు, వృద్ధులకు ముఖ్యంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
పాలలో కాల్షియం, ప్రోటీన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అరటి పండ్లలో పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కలిసి ఎముకలు, గుండె, జీర్ణ వ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా మానసిక శక్తి మెరుగు పడుతుంది.
పాలు, అరటిపండు కలిపి తినడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాలు:
శక్తి కేంద్రం: పాలు, అరటి పండు కలిపి తింటే తక్షణ శక్తిని అందిస్తాయి. పాలలోని ప్రోటీన్ , అరటి పండ్లలోని సహజ చక్కెరలు కలిసి కండరాలు, మెదడుకు త్వరిత ఇంధనాన్ని అందిస్తాయి. ఇది బ్రేక్ పాస్ట్ కోసం లేదా వ్యాయామం తర్వాత తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. పిల్లలు, పని చేసే వ్యక్తులకు.. ఇది రోజంతా శక్తిని అందించడానికి సహాయ పడుతుంది.
జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది: అరటి పండ్లు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా పాలలో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ కలయిక జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. ఇంకా.. ఇది గ్యాస్, అజీర్ణాన్ని తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది: అరటి పండ్లలోని పొటాషియం, పాలలోని కాల్షియం గుండె పనితీరును నిర్వహించడానికి సహాయ పడతాయి. ఈ కలయిక రక్తపోటును నియంత్రించడంలో అంతే కాకుండా ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి సహాయ పడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
Also Read: ఆడబిడ్డల్ని బతకనిద్దాం..చిట్టితల్లికి ఎన్నాళ్లీ కన్నీళ్లు ?
ఎముకలను బలపరుస్తుంది: పాలలో తగినంత కాల్షియం, ప్రోటీన్ ఉంటాయి. అరటిపండ్లు ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఈ కలయిక ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది. ముఖ్యంగా పిల్లలు, యువకులు, వృద్ధులకు ఎముకల ఆరోగ్యానికి ప్రయోజన కరంగా ఉంటుంది.
మానసిక అలసట, ఒత్తిడిని తగ్గిస్తుంది: అరటి పండ్లలోని ట్రిప్టోఫాన్, పాలలోని ప్రోటీన్ కలిసి మెదడులో సెరోటోనిన్‌ను పెంచుతాయి. అంతే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రను కూడా మెరుగు పరుస్తుంది. చదువుకున్న తర్వాత.. పని చేసిన తర్వాత లేదా వ్యాయామం చేసిన తర్వాత అరటి పండ్లు తినడం వల్ల మానసిక అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మీ మానసిక స్థితిని రిఫ్రెష్ అవుతుంది.