White Hair to Black Hair: ఇటీవల కాలంలో చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే వివిధ రకాల షాంపులు, ఆయిల్స్, జుట్టుకు వేసుకునే కలర్స్ ఉపయోగిస్తున్నారు. వీటివల్ల ఫలితం ఉంటుందో లేదో పక్కన పెడితే.. జుట్టురాలిపోయే ప్రమాదం ఉంది. పైగా వీటివల్ల అనేక చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శాశ్వతంగా తెల్లజుట్టును నివారించేందుకు.. ఈ చిట్కాలు పాటించండి. మంచి ఫలితం ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవాలు, బాదం, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో గుప్పెడు బాదం పప్పులు, ఆవాలు గుప్పెడు వేసి, బాగా నల్లగా వచ్చేంతవరకు వేయించాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెత్తగా పొడి చేసుకుని.. చిన్నగిన్నెలోకి తీసుకోండి. ఇందులో కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేసి జుట్టంతా అప్లై చేయండి. సుమారు 40 నిమిషాలు ఉంచి ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
బాదం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు, కలోంజీ సీడ్స్ హెయిర్ మాస్క్
ముందుగా స్టవ్ వెలిగించి అందులో బాదం పప్పులు, కలోంజీ సీడ్స్, కరివేపాకు, వెల్లుల్లిపాయ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు వేసి బాగా నల్లగా వేయించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి తయారు చేసుకున్న పదార్దాలన్నింటిని.. మిక్సీజార్ లోకి తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో ఆవాల నూనె కలిపి జుట్టుకు అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాల వల్ల.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
గోరింటాకు, ఉసిరిపొడి, బీట్‌రూట్ జ్యూస్ హెయిర్ మాస్క్
ముందుగా బీట్‌రూట్‌ను జ్యూస్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. చిన్న గిన్నె తీసుకుని అందులో గోరింటాకు పొడి రెండు టేబుల్ స్పూన్, ఉసిరిపొడి రెండు టేబుల్ స్పూన్, బీట్ రూట్ రసం కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్లకు అప్లై చేసి.. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు వారాలకు ఒకసారి చేయడం ద్వారా తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుస్తుంది.ఇందులో ఉపయోగించే పదార్ధాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
Also Read: ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా డ్రాగన్ ఫ్రూట్.. ఇలా చేస్తే మెరిసేటి చర్మం మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.