BigTV English

Haldi Water: పసుపు ఇలా వాడితే మీ అందం రెట్టింపు అవడం పక్కా !

Haldi Water: పసుపు ఇలా వాడితే మీ అందం రెట్టింపు అవడం పక్కా !

Haldi Water For Glowing Skin: పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్లను, ఇతర ఆరోగ్య సమస్యలకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అందుకే డైలీ మనం చేసుకునే ఆహారాల్లో తప్పకుండా పసుపును వినియోగిస్తుంటాం. ఇది వంటలకు రంగు, రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కూడా పసుపు కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


ఇందులోని ఔషధ గుణాలు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసి ముఖాన్ని మరింత మెరిసేలా చేస్తాయి.అయితే ఇందుకోసం మీరు చేయాల్సినంది రోజు పసుపు వాటర్ తాగడమే. ఇలా తాగడం వల్ల అనేక రకాల బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లోయింగ్ స్కిన్:
పసుపులో ఉండే పోషకాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కణాలు దెబ్బతినకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు డైలీ పసుపు నీరు తీసుకోవడం ద్వారా మంచి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం చేసుకోవచ్చు.


మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది:
పసుపులో ఉండే కర్కుమిన్ బ్యాక్టీరియాతో పోరాడటానికి, మొటిమలను తగ్గించడానికి చాలా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మచ్చలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని అంటున్నారు.

యవ్వనంగా కనిపించడానికి :
డైలీ పసుపు వాటర్ తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చిన్న వయస్సులో వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా నవయవ్వనంగా ఉంచేలా తోడ్పడుతుంది.

డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది:
ప్రస్తుత రోజుల్లో చాలా మంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు పసుపు కలిపిన నీరు లేదా పసుపు ఆధారిత క్రీములను వాడటం వల్ల ఈజీగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. డార్క్ సర్కిల్స్ ఉన్న వారు రోజుకు రెండుసార్లు పసుపు ఆధారిత క్రీములు అప్లై చేసుకోవడం వల్ల నల్లటి వలయాలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పరిశోధనలో ఢిల్లీలోని డెర్మటాలజీ కాస్మెటిక్ సర్జరీ విభాగంలో పనిచేసే డాక్టర్లు పాల్గొన్నారు. పసుపులోని పోషకాలు కళ్ల కింద ఉన్న డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయని వారు పేర్కొన్నారు.

గాయాలను నయం చేయడం:
పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ యాక్సిడెంట్ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి చర్మంపై గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి. అదనపు సెబమ్ ఉత్పత్తిని ఇది నియంత్రిస్తుంది. సాధారణంగా చర్మంపై సెబమ్ పెరగడం వల్ల చర్మంపై ఆయిల్ ఉత్పత్తి అయి జిడ్డుగా మారుతుంది. ఫలితంగా ముఖంపై మొటిమలు, మచ్చలు ఎక్కువవుతాయి.

పసుపు వాటర్ తీసుకోవడం వల్ల సెబమ్ ఉత్పత్తి నియంత్రణలో ఉండి జుట్టుపై చర్మం ఏర్పడకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో పసుపు వాటర్ చాలా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తామర, సోరియాసిస్, వంటి చర్మ వ్యాధులు నివారించడంలో సహాయపడతాయి.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×