BigTV English

Ponnam gets Emotional: ఇది.. నా జీవితంలో మరపురాని ఘట్టం : మంత్రి పొన్నం భావోద్వేగం

Ponnam gets Emotional: ఇది.. నా జీవితంలో మరపురాని ఘట్టం : మంత్రి పొన్నం భావోద్వేగం

Minister Ponnam gets Emotional: రాష్ట్ర రాష్ట్ర ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమోషనలయ్యారు. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియోలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని.. దానిని అమలు చేస్తున్నది. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నది. ఈ మహత్తర కార్యక్రమాన్ని ఇంప్లీమెంట్ చేస్తున్న రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా భాగస్వామ్యం ఉండడం తన జీవితంలో మరపురాని ఘట్టమన్నారు.

Also Read: తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ లోకూర్ నియామకం


లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సహచర మంత్రులకు కృతజ్ఞతలంటూ ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నారన్నారు. రుణమాఫీతో రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు. వారు ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో నడుస్తదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం రైతన్నలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×