BigTV English

Bike Riding Tips : సమ్మర్.. బైక్ రైడర్స్ ఈ జాగ్రత్తలు పాటించండి!

Bike Riding Tips : సమ్మర్.. బైక్ రైడర్స్ ఈ జాగ్రత్తలు పాటించండి!

summer tips


Summer Bike Riding Tips : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఇలాంటి ఎండల్లో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తప్పనిసరై తమ టూవీలర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. కొందరైతే ఎండలు అధికంగా ఉన్న బైక్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఫీల్ అవ్వాలని కోరుకుంటారు. మరి కొందరు తప్పనిసరై దూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు.

అయితే ఎండల్లో బండి నడిపే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. అసలే బయట వాతావరణం వేడికి బైక్ ఇంజిన్ నుంచి వెలువడే వేడి రెండు కలిపి ఒక్కోసారి బైక్ కాలిపోయిన సందర్భాలు చాలనే ఉన్నాయి. వేసవిలో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు బైక్ రక్షణతో పాటు మన రక్షణ కూడా ముఖ్యం. అవేంటో ఒకసారి తెలుసుకుందా..


వేసవిలో బయటకు వెళ్లేప్పుడు తప్పనిసరిగా హైడ్రేటెడ్‌గా ఉండాలి. శరీరానికి తగినంత నీళ్లు తాగాలి. ముఖ్యంగా రైడింగ్ చేసే ముందు నీళ్లు తాగడం చాలా మంచిది. మనతో పాటు ఒక వాటర్ బాటిల్ ఎప్పుడూ ఉంచుకోవాలి.

Read More : ముక్కు, గొంతు, చెవులు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

వేసవిలో మంచి దుస్తులు ధరించాలి. బైక్ డ్రైవ్ చేసేప్పుడు శరీరానికి గాలి అందేలా పలుచని కాటన్ దుస్తులు వేసుకోవాలి. అలాగే తేలికైన షూస్, ప్లాంట్లు వాడాలి. తెలుపు రంగు దుస్తులు వాడితే ఇంకా మంచిది. ఇది సూర్యరశ్మి నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది.

వేసవిలో బయటకు వెళ్లేప్పుడు హెల్మెట్ కచ్చితంగా వినియోగించాలి. దాని క్వాలిటీ విషయంలో రాజీపడొద్దు. ముఖ్యంగా గాలి హెల్మెట్ లోపలికి ప్రవేశించేలా చూడాలి. భద్రతా ప్రమాణాలు పాటించి ఉన్న హెల్మెట్‌ను ఎంచుకుంటే మన ప్రాణాలకు రక్షణ ఉంటుంది. హెల్మెట్ వాడకుంటే సమ్మర్‌లో మీ జుట్టుపై ప్రభావం పడుతుంది.

వేసవిలో ఎండల నుంచి కంటి రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్‌ను వాడాలి. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన కిరణాల నుంచి మీ కళ్ల రక్షణ కోసం యూవీ రక్షణతో ఉన్న లెన్స్‌లను ఎంచుకోవాలి. గ్లాసెస్ ఉపయోగించకుంటే వేడి గాలులకు కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కంటిలో దుమ్ము కూడా చేరుతుంది.

వేసవిలో బైక్‌పై బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా కంఫర్ట్‌గా ఉండే పాదరక్షలు ఉపయోగించాలి. గాలిని సమర్థంగా ప్రసరించేలా వెంటిలేటెడ్ రైడింగ్ బూట్లు ఎంచుకోవాలి. మీ పాదాలను ఎప్పుడూ చల్లగా, తేమ లేకుండా ఉండేలా చూడండి. లబ్బర్ లేదా ప్లాస్టిక్‌తో ఉండే పాదరక్షలకు దూరంగా ఉండండి. అవి వేడిని గ్రహిస్తాయి.

Read More : పారాసిటమాల్‌ టాబ్లెట్ ఎక్కువగా వాడుతున్నారా..!

వేసవిలో బయటకు వెళ్తే అధిక ఎండల కారణంగా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి కచ్చితంగా బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ క్రీములను చర్మానికి రాసుకోవాలి. కొంచెం జిడ్డుగా ఉన్నప్పటికీ సన్ స్క్రీన్ క్రీమ్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటి ఎంపికలో కొన్ని జాగ్రత్తలు పాటించండి.

  • వాహనాలను పార్కింగ్ చేయాల్సి వస్తే.. చెట్లు కింద లేదా నీడలో చేయండి.
  • వేసవిలో టైర్లలో గాలి తగ్గిపోతుంది. తరచూ గాలిని తనిఖీ చేయండి.
  • ఎండలో బైకులు ఎక్కువ సమయం ఉంచితే ఆయిల్ ఆవిరైపోతుంది.
  • పెట్రోల్ ట్యాంక్‌కు మందపాటి కవర్ ఉండేలా చూడండి.
  • వేసవిలో దూరప్రయాణాలు తగ్గించడం మేలు.
  • దూరప్రాంతాలకు వెళ్లేప్పుడు ఇంజన్ అధికంగా హీట్ అవుతుంది. కాబట్టి ప్రయాణానికి కొంత గ్యాప్ ఇవ్వండి.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×