BigTV English

Child Artist Keerthana: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఐఏఎస్, సక్సెస్ జర్నీ

Child Artist Keerthana: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఐఏఎస్, సక్సెస్ జర్నీ

child artist keerthana ias journey success story


Child Artist Keerthana Success Story: చాలామంది తాము అనుకున్న మార్గంలో రాణించేందుకు తెగ ట్రై చేస్తుంటారు. కానీ వారికి పరిస్థితులు అనుకూలించవు. దీంతో ఏదో ఒక జాబ్‌లో జాయిన్‌ అయి వారి కుటుంబాన్ని చక్కదిద్దుకుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఓ కన్నడ చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం అలా కాంప్రమైజ్ కాలేదు. తాను ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలనుకుంది. ఎన్నో ఛాలెంజ్‌లను ఫేస్ చేసింది. చివరికి ఐఏఎస్‌ జాబ్‌ని సాధించి, ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది. ఇంతకీ ఎవరావిడ అనుకుంటున్నారా ఆమె మరెవరో కాదు.. హెచ్‌ఎస్ కీర్తన. ఆవిడ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్‌ దిస్ స్టోరీ.

మూవీస్, టీవీ షోలలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌లు చాలామంది సీరియల్స్ నుండి మూవీస్ వైపుగా వస్తుంటారు. వారి సినీ కెరీర్‌ కూడా అంతటితోనే బ్రేక్ అవుతుందని అనుకుంటారు కొంతమంది. అంతేకాకుండా సినీ ఫీల్డ్‌ అంటేనే చిన్న చూపు చూస్తుంటారు మరికొందరు. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ కూడా ఒక్కోసారి కావాల్సిన ఎంకరేజ్‌మెంట్ ఇవ్వగలుగుతుంది. అలా చాలామంది నటీనటులు నిజజీవితంలో డాక్టర్స్‌గా, ఇండస్ట్రీయలిస్ట్‌గా, టీచర్స్‌, లెక్చరర్స్‌గా ఇలా వారికి నచ్చిన రంగాల్లో సెటిల్ అయ్యారు.


Read More: ‘రాబిన్‌హుడ్’ కోసం రామ్-లక్ష్మణ్‌లు.. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్

కానీ.. మనం మాట్లాడుకునే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం అలా చేయలేదు. తాను ఐఏఎస్ కావాలనుకున్న డ్రీమ్‌ని నిజం చేసుకొని విమర్శకుల నుండి ప్రశంసలను పొందుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.
హెచ్‌ఎస్‌ కీర్తన. చిన్నప్పుడు అంటే కొన్నేళ్ల క్రితం ఒక పాపులర్‌ చైల్డ్ ఆర్టిస్ట్. తెలుగుతో పాటు కన్నడ సినిమాలు, సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసింది. ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది. కర్పూరద గొంబే, గంగా యమునా, ముద్దిన అలియా, ఉపేంద్ర, ఎ కానూరు హెగ్గదాటి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఓ మల్లిగే, లేడీ కమీషనర్, హబ్బ, దొరే, సింహాద్రి, జనని, చిగురు, పుటాని ఏజెంట్, పుతని వంటి మూవీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.

వరుస ఛాన్సులతో బిజీగా ఉన్న తానూ.. ఐఏఎస్ అయ్యి ప్రజలకు సేవా చేయాలనుకుంది. అనుకున్నట్టుగానే యూపీఎస్సీ పరీక్షకు రాసింది. మొదటి అటెమ్ట్‌లో ఫెయిల్ అయింది. అయినా సరే ఏమాత్రం భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ఐదుసార్లు యూపీఎస్సీ పరీక్షకు హాజరైంది. ఐదుసార్లు ఆమె క్వాలిఫై కాలేకపోయింది. ఆరవ అటెమ్ట్‌లో ఉత్తీర్ణత సాధించింది. తన ఫస్ట్ పోస్టింగ్ కోసం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాను ఎంచుకుంది. అసిస్టెంట్ కమీషనర్‌గా అపాయింట్‌మెంట్ తీసుకుంది.

Read More: రాడిసన్ డ్రగ్స్ కేసు.. దర్శకుడు క్రిష్‌కి బిగ్ రిలీఫ్

ఇక ఐఏఎస్ అధికారి కావడానికి ముందు 2011లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్ పరీక్షకు హాజరైంది. దానిని సింగిల్ టైంలో క్లియర్‌ చేసిన అనంతరం ఆమె రెండేళ్లు ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేసింది. ఇలా.. ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను కొనసాగిస్తూ తన యాక్టింగ్ లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేస్తుంది కీర్తన. నిజంగా ఇలాంటి వాళ్లు ఏది మన వల్ల కాదని అనుకునే ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. అలాగే తన కర్తవ్యాన్ని మరవకుండా ఓ వైపు ఐఏఎస్ జాబ్‌ని, మరోవైపు సినీ ఫిల్డ్‌ని వదలకుండా బ్యాలెన్స్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×