E-Paper
Advertisement

Walnuts: వీళ్లు పొరపాటున కూడా.. వాల్ నట్స్ తినొద్దు తెలుసా ?

Walnuts: వీళ్లు పొరపాటున కూడా.. వాల్ నట్స్ తినొద్దు తెలుసా ?

Walnuts: వాల్ నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్,ఫైబర్, ప్రోటీన్, అనేక విటమిన్లు, ఖనిజాలు ఉండటం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్ గా కూడా పరిగణిస్తారు. అవి మెదడుకు పదును పెడతాయి. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇన్ని పోషకాలు ఉన్న వాల్ నట్స్ తినడం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు వీటిని ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తినకూడదు అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాల్ నట్స్ ప్రయోజనాలు:

యాంటీ ఆక్సిడెంట్లు:
వాల్‌నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లకు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి అంతే కాకుండా ఆరోగ్య కరమైన గుండెను నిర్వహించడానికి సహాయ పడతాయి. తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వాల్ నట్స్ తినడం చాలా మంచిది.

అద్భుతమైన శక్తి:
వాల్‌నట్‌లను కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థంగా పరిగణిస్తారు. వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల కూడా గణనీయమైన శక్తి లభిస్తుంది. అందుకే.. ఉదయం వీటిని తినడం వల్ల మీ రోజు వారి పనులు చేుకోవడానికి తగినంత శక్తి లభిస్తుంది.

ఫైబర్ పుష్కలం:
వాల్‌నట్స్‌లో ఫైబర్ ఉంటుంది.ఇది జీర్ణక్రియ, బరువు తగ్గడంలో చాలా సహాయ పడుతుంది. ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. తరచుగా ఆకలి బాధలను నివారిస్తుంది. అంతే కాకుండా ఇది బరువు నియంత్రణలో ఉంచడానికి సహాయ పడుతుంది. ఇంకా.. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక హెచ్చుతగ్గులను నివారిస్తుంది. తద్వారా మధుమేహాన్ని నివారించడంలో కూడా సహాయ పడుతుంది.

విటమిన్ E:
వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ ఉంటుంది. అందుకే అవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్ ఇ అనేక వృద్ధాప్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంటే చక్కటి గీతలు, ముడతలు, చర్మం కుంగిపోవడం వంటివి.

వాల్‌నట్స్ ఎవరు తినకూడదు ?
అలెర్జీ ఉన్నవారు : వాల్ నట్స్ అలెర్జీ ఉన్నవారికి ప్రమాదకరం. వాటిని తినడం వల్ల దురద, దద్దుర్లు, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తీవ్రమైన సందర్భాల్లో అనాఫిలాక్సిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

జీర్ణ సమస్యలు: వాల్‌నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కానీ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా ఇప్పటికే ఉన్న జీర్ణ సమస్యలు ఉన్నవారు వాటిని చాలా తక్కువ మోతాదులో తినాలి.

రక్తస్రావ సమస్యలు: ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి. రక్తం గడ్డకట్టే సమస్యలు లేదా రక్తస్రావం లోపాలు ఉన్నవారు వాల్‌నట్‌లను నివారించాలి. ఎందుకంటే అవి రక్త స్రావం ప్రమాదాన్ని పెంచుతాయి.

సర్జరీ: సర్జరీ చేయించుకోబోయే వారు కనీసం రెండు వారాల ముందుగానే వాల్‌నట్స్ తినడం మానేయాలి. వాల్‌నట్స్ రక్తాన్ని పలుచగా చేస్తాయి. ఇది శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం, సమస్యలను పెంచుతుంది.

Also Read: చలికాలంలో చుండ్రు వల్ల జుట్టు రాలుతోందా? ఈ చిట్కాలు పాటిస్తే రిజల్ట్ పక్కా!

బరువు తగ్గాలనుకునే వారు: వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ వాటిలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు బరువు తగ్గించే ఆహారం తీసుకుంటూ.. నిరంతరం వాల్‌నట్స్ తింటుంటే, మీరు బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుకోవచ్చు.

కిడ్నీలో రాళ్లు : వాల్‌నట్స్‌లోని ఆక్సలేట్లు కిడ్నీలో రాళ్లను మరింత తీవ్రతరం చేస్తాయి. ఇప్పటికే కిడ్నీస్టోన్స్ ఉన్నవారు డాక్టర్‌ని సంప్రదించకుండా వాల్‌నట్స్ తినకూడదు.

షుగర్ వ్యాధిగ్రస్తులు: వాల్‌నట్స్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడినప్పటికీ.. వాటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల చక్కెర స్థాయిలు మరింత దిగజారిపోతాయి.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×