BigTV English

Silky Hair tips: జుట్టుకు షాంపూ పెట్టాక ఈ ఒక్క వస్తువుతో మీ వెంట్రుకలను శుభ్రం చేసుకోండి చాలు, సిల్కీగా మారిపోతాయి

Silky Hair tips: జుట్టుకు షాంపూ పెట్టాక ఈ ఒక్క వస్తువుతో మీ వెంట్రుకలను శుభ్రం చేసుకోండి చాలు, సిల్కీగా మారిపోతాయి

జుట్టు సిల్కీగా మెరిసేలా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. షాంపూ చేసిన తర్వాత ఎంతోమంది కండిషనర్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల జుట్టు సిల్కీ గా ఉంటుందని వారి అభిప్రాయం. అది నిజమే కావచ్చు. కానీ కండిషనర్ ధరలు చాలా ఎక్కువ. అంత డబ్బును వృధా చేసే బదులు సిల్కీగా మృదువుగా జుట్టును ఉంచుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించండి.


షాంపూ చేసిన తర్వాత ఆపిల్ సిడర్ వెనిగర్ ను ఉపయోగించండి. ఇందుకోసం రెండు కప్పుల నీటిలో ఒక కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. తలస్నానం చేసేసిన తర్వాత ఈ నీటితో మీ జుట్టును ఒకసారి కడుక్కోండి. తలలో పీహెచ్ స్థాయిలను ఆపిల్ సైడర్ వెనిగర్ కాపాడుతుంది. చుండ్రు దురద సమస్యలు లేకుండా తొలగిస్తుంది. దుమ్ము వల్ల, కాలుష్యం వల్ల జుట్టును దెబ్బతినకుండా రక్షిస్తుంది. మీ వెంట్రుకలను మృదువుగా చేస్తుంది. వెంట్రుకలకు సహజమైన మెరుపులు అందిస్తుంది.

గ్రీన్ టీ
గ్రీన్ టీ తాగితేనే కాదు తలకి రాసుకున్నా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మానికి, జుట్టుకు ఎన్నో ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. గ్రీన్ టీను రెండు నుండి మూడు కప్పుల నీటిలో మరిగించి ఆపై ఫిల్టర్ చేయండి. ఆ ఫిల్టర్ చేసిన నీటితో జుట్టుకు షాంపూ పెట్టుకున్నాక వెంట్రుకలను కడగండి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మెరుపు రావడం ఖాయం. చిక్కులు పడే సమస్య కూడా చాలా తగ్గిపోతుంది. దీని వల్ల జుట్టు తెగకుండా రాలకుండా ఉంటుంది.


బియ్యం నీరు
బియ్యం నీరు జుట్టును బలపరుస్తుంది. అలాగే జుట్టుని మెరిసేలా చేస్తుంది. కొరియన్లు అధికంగా వాడేది బియ్యం నీటినే. బియ్యాన్ని 24 గంటలు నానబెట్టి ఆ తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేసి ఒక స్ప్రే బాటిల్ లో వేయండి. షాంపూ చేసుకున్నాక ఆ నీటిని తలపై పూసుకోండి. తర్వాత బియ్యం నీటితో కడగండి. జుట్టు సిల్కీగా మెరిసిపోతూ ఉంటుంది.

మందార పూల నీరు
మూడు నుండి నాలుగు మందార పువ్వులను తీసుకొని ఒక లీటర్ నీటిలో బాగా మరిగించండి. మీరు బాగా మరిగాక దానిని వడకట్టి ఆ నీటిని జుట్టుకు పట్టించండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి. జుట్టు సిల్కీగా మెరవడం మొదలవుతుంది. ఇలాగే బ్లాక్ కాఫీని కూడా నీటిలో మరిగించి ఫిల్టర్ చేసి తలకి షాంపూ చేసుకున్నాక ఆ బ్లాక్ టీతో జుట్టును కడిగేందుకు ప్రయత్నించండి. ఇది అద్భుతంగా పనిచేసే చిట్కా.

Related News

Bad Breakfasts: బ్రేక్ ఫాస్ట్‌లో ఇలాంటివి తిన్నారంటే గుండె పోటు ప్రమాదం పెరిగిపోతుంది అంటున్న డాక్టర్లు

Sweet Corn Kebab: వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుందా? స్వీట్ కార్న్‌తో కబాబ్ చేయండి అదిరిపోతుంది

Millets: మిల్లెట్స్ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Big Stories

×