Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇటీవల కుబేర సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ భాషలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు. ఇటీవలే మైసా(Mysaa) అనే కొత్త సినిమాని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది అయితే రష్మిక నటిస్తున్న థమా సినిమా(Thama Movie) కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇన్ని రోజులపాటు ప్రేమకథ సినిమాలలో నటించి మెప్పించిన రష్మిక మొదటిసారి ఈ సినిమా ద్వారా భయపెట్టడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.
అంచనాలు పెంచిన పోస్టర్..
తాజాగా రష్మిక నటిస్తున్న థమా సినిమా నుంచి ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster) విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో రష్మిక తడాఖా పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్లో గ్రీన్ కలర్ డ్రెస్సులో జుట్టు మొత్తం వదిలేసి కళ్ళకు కాటుక పెట్టుకుని భయంకరమైన లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఆగస్టు 19వ తేదీ ఉదయం 11:11 గంటలకు రాబోతుందని వెల్లడించారు. అలాగే ఈ దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు.
మొదటిసారి హర్రర్ సినిమాలో రష్మిక..
ఇక ఈ హర్రర్ సినిమాకు ఆదిత్య సర్పోట్డార్ దర్శకత్వం వహించగా మాడాక్స్ ఫిలిమ్స్, దినేష్ విజన్ ప్రజెంట్ బ్యానర్ పై అమర్ కౌశిక్, దినేష్ విజయం నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురాన్ (Ayushmann Khurrana)నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రష్మిక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రష్మిక సినిమాపై అంచనాలను పెంచేసారని చెప్పాలి. ఇక ఈ సినిమాతో పాటు రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే మైసా సినిమా దగ్గర షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమా అవకాశాలను అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈమె నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఈమె టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు జంటగా వెళ్లటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ చూస్తే మాత్రం ప్రేమలో ఉన్నారని స్పష్టమవుతుంది కానీ ఈ ప్రేమ విషయాన్ని మాత్రం ఇప్పటివరకు అధికారకంగా స్పందించలేదు.
Also Read: Jayammu Nischayammuraa: చాలా లీలలున్నాయి.. శ్రీలీల పై కంప్లైంట్ చేసిన జగ్గు భాయ్!