E-Paper
Advertisement

Naveen Yadav: 45వేల ఓట్ల మెజారిటీతో గెలిచేది నేనే.. వార్ వన్ సైడే.. గెలుపుపై నవీన్ యాదవ్ ధీమా

Naveen Yadav: 45వేల ఓట్ల మెజారిటీతో గెలిచేది నేనే.. వార్ వన్ సైడే.. గెలుపుపై నవీన్ యాదవ్ ధీమా
Advertisement

Naveen Yadav: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో.. ప్రధాన పార్టీల అభ్యర్థులలో గెలుపు ధీమా మరింత పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తానే విజయం సాధిస్తానని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో.. కౌంటింగ్‌కు ముందు ఆయన ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గెలుపుపై నవీన్ యాదవ్ ధీమా

Advertisement

ప్రజల ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని నవీన్ యాదవ్ ఈ సందర్భంగా అన్నారు. ‘జూబ్లీహిల్స్‌లో విజయం నాదే. ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాను. ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచే నాకు మంచి లీడ్ మొదలవుతుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం 45 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలకు ఎంతో కీలకం కానుంది.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం 48.49గా నమోదైంది. ఈ ఎన్నిక కోసం మొత్తం 407 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరుగనుంది. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో ఓట్లను లెక్కించనున్నారు. తొలుత షేక్‌పేట్ (Shaikpet) డివిజన్ ఓట్లను లెక్కించిన తర్వాత, వరుసగా మిగతా 6 డివిజన్ల ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ పది రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

ALSO READ: Jubilee Hills bypoll counting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ షురూ.. పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ లీడ్

Related News

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×