చెవిలో గులిమిని పేరుకుపోవడం అనేది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య. ఒక్కొక్కసారి అది గట్టిగా మారి విపరీతమైన నొప్పికి కారణం అవుతుంది. వర్షంలో తడిసినప్పుడు, స్నానం చేసినప్పుడు చెవుల్లోకి నీరు వెళ్లడం సహజమే. దీని వల్ల కూడా చెవిలో ఉన్న గులిమి ఉబ్బి బాగా నొప్పి పెడుతుంది. నిజానికి చెవిలో ఉన్న గులిమి చెవిని రక్షించడానికే ఉంది.
కానీ అధికంగా తేమ చేరినా లేదా అధికంగా పొడిగా మారినా కూడా చెవిలో గులిమి నొప్పికి కారణం అవుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ కు కూడా కారణం అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో గులిమిని తొలగించుకోవాలి. మీకు చెవిల్లో విపరీతమైన దురద, నొప్పి, వినికిడి సమస్య అనిపిస్తే సులువుగా ఇంట్లోనే గులిమిని తొలగించుకోవచ్చు.
నూనెలతో ఇలా చేయండి
చెవిలో గులిమిని తొలగించడానికి మీరు ఆవ నూనె, కొబ్బరి నూనె, లేదా ఆలివ్ నూనెను ఉపయోగించుకోవచ్చు. ఈ నూనెలను కొద్దిగా వేడి చేసి చెవిలో వేయండి. అప్పుడు గులిమి మృదువుగా మారుతుంది. తర్వాత అది సులువుగా బయటకు వచ్చే అవకాశం ఉంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్
హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించడం ద్వారా కూడా ఇయర్ వాక్స్ ను సులభంగా కలిగించవచ్చు. మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్న ఇయర్ వ్యాక్స్ ను ఏదైనా మెడికల్ షాప్ నుండి కొనుగోలు చేయండి. కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి చెవిలో వేయండి. అప్పుడు లోపల ఉన్న గులిమి మెత్తగా మారి ఉబ్బినట్టు అవుతుంది. అలాంటి సమయంలో మీరు దాన్ని తొలగించవచ్చు.
తులసి ఆకుల రసం
తులసి ఆకుల రసాన్ని చెవిలో వేయడం ద్వారా కూడా నొప్పిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే తులసి ఆకుల రసాన్ని గులిమి పీల్చుకొని ఉబ్బినట్టు అవుతుంది. ఆ సమయంలోనే దాన్ని తొలగించుకోవాలి.
ఉప్పు నీరు
చెవిలో గులిమిని తొలగించడానికి ఉప్పు నీరు కూడా అద్భుతంగా పనిచేస్తుందని చెబుతారు. అర టీ స్పూను ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించండి. ఇప్పుడు గోరువెచ్చగా మారిన తర్వాత ఒకటి లేదా రెండు చుక్కలు నీటిని వేసి కాటన్ సహాయంతో క్లీన్ చేయండి. తలను ఒక వైపుకు వంచి ఉంచండి. అంటే చెవిలో వేసిన నీరు బయటికి రాకుండా చూసుకోండి. ఆ నీటిని గులిమి పీల్చుకుంటుంది. ఆ తర్వాత అది చెవి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో శుభ్రమైన వస్త్రంతో గులిమిని బయటకు తీయాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
అయితే చెవిలోకి చాలా లోతుగా ఏ వస్తువును పెట్టకూడదు. మీకు చెవి విపరీతమైన నొప్పి పెడితే మాత్రం వైద్యుడిని కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ విపరీతమైన నొప్పి చెవి ఇన్ఫెక్షన్ వల్ల కలిగే అవకాశం ఉంటుంది. మీరు గులిమిని తొలగించుకోవాలంటే అది మీ కంటికి కనిపించే దగ్గరగా ఉంటేనే తొలగించుకోవాలి. లోపలి వరకు ఎలాంటి పదునైన వస్తువులను పెట్టకూడదు. ఇది చెవి పోటుకు లేదా కర్ణభేరి కి రంద్రం పడడానికి కారణం అవుతుంది.