BigTV English

HHVM OTT : ‘హరిహర వీరమల్లు’ ఓటీటీ డేట్ లాక్..స్ట్రీమింగ్ అప్పుడేనా..?

HHVM OTT : ‘హరిహర వీరమల్లు’ ఓటీటీ డేట్ లాక్..స్ట్రీమింగ్ అప్పుడేనా..?

HHVM OTT : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు.. భారీ అంచనాలతో నేడు ఈ మూవీ థియేటర్లలోకి రిలీజ్ అయింది.. ఐదేళ్లుగా సెట్స్ మీదనే ఉన్న ఈ మూవీ ఇన్నాళ్లకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్‌ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. బుధవారం రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, టిక్కెట్ రేట్లు పెరిగినప్పటికీ మంచి స్పందన లభించింది. థియేట్రికల్ బిజినెస్ కన్నా ఓటీటీ డీల్ పైనే నిర్మాత దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఓటీటీ డేట్ ను లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ మూవీ డేట్ ఎప్పుడో ఒకసారి తెలుసుకుందాం..


‘వీరమల్లు’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..? 

హరిహరవీరమల్లు మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే.. దాదాపు ఐదేళ్లు నుంచి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు వాళ్ల కల నెరవేరింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో సినిమా నేడు థియేటర్లలోకి వచ్చేసింది. బుధవారం పడిన ప్రీమియర్ షో లతోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా భారీగానే కలెక్షన్లను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి హక్కుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దాదాపుగా రూ. 50 కోట్లకు పైగా చెల్లిందన్న విషయం తెలిసిందే.. ఈమధ్య స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా కేవలం నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేస్తున్నాయి.. అయితే థియేటర్లో రిలీజైన 8 వాారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా డీల్ కుదిరిందట.. సెప్టెంబర్ చివరి వారం ఓటీటీలోకి రాబోతుందన్నమాట..


Also Read: ‘హరిహర వీరమల్లు’ మూవీపై ఆది రివ్యూ.. ఏమన్నాడంటే?

వీరమల్లు ప్రీమియర్ కలెక్షన్స్.. 

ఇవాళ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ వీరమల్లు ప్రీమియర్ షోలతో భారీగానే వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది. పవన్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. మొదటి రోజు కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.50 నుండి రూ.70 కోట్లు వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు శుక్రవారం రూ.50 కోట్లు, శనివారం రూ.50 కోట్లు ఇక ఆదివారం వరకు కూడా ఇదే కలెక్షన్స్ కొనసాగుతాయని.. వీకెండ్ ముగిసే సరికి కచ్చితంగా రూ.200 నుండీ రూ.220 కోట్లు పక్కాగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ మూవీ భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత ఓజీ సినిమా కూడా రెడీగా ఉంది.  అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు డేట్ ని లాక్ చేసుకుంది. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.

 

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×