BigTV English

Botsa Satyanarayana: జగన్ తర్వాత నెంబర్ 2 బొత్సేనా?

Botsa Satyanarayana: జగన్ తర్వాత నెంబర్ 2 బొత్సేనా?

Botsa Satyanarayana: రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరి హవా నడుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు.. చోటా నాయకుడిగా ఉన్నవాళ్లు ఒక్కసారి కీలక బాధ్యతల్లోకి వెళ్లి పోతారు.. సీనియర్ నాయకులు సడన్‌గా గడ్డుకాలం ఎదుర్కొంటారు.. ప్రస్తుతం వైసీపీలో సీనియర్లకు కొదవలేదు.. కాంగ్రెస్ నుంచి వైసీపీ తీర్థం తీసుకున్న సీనియర్ రాజకీయ నాయకుల్లో చాలామంది ప్రస్తుతం ఫేడ్అవుట్ అయ్యే స్థితిలో ఉన్నారు … కానీ బొత్స సత్యనారాయణ మాత్రం తన రాజకీయ అనుభవాన్ని రంగరించి వైసీపీలో కీలకంగా కొనసాగుతూ పార్టీకే కాదు పార్టీ నాయకుడికి కూడా తలలో నాలుక లాగా వ్యవహరిస్తూ తన సీనియారిటీతో వైసీపీలో సమర్దంగా నెట్టుకొస్తున్నారు.. వైసీపీలోని మిగిలిన సీనియర్ రాజకీయ నాయకుల తీరు ఎలా ఉన్నా తన వ్యవహార శైలితో అధికార కూటమిని టార్గెట్ చేస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.. ఆ క్రమంలో వైసీపీలో ఆయన నెంబర్ టూ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది


కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన పలువురు సీనియర్లు

ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీ పార్టీలో జగన్ అవకాశం ఇచ్చిన నాయకులతో పాటు, కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు వచ్చి వైసిపి పార్టీలో జాయిన్ అయి కీలకమైన నాయకుడిగా మారిన వారిలో మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ముందు వరసలో ఉంటారు.. కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్ బతికున్నప్పటి నుంచి కొనసాగిన సీనియర్ నాయకుల్లో పలువురు.. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్లు వైసీపీలో ఎంత మంది ఉన్నా బొత్స సత్యనారాయణ మాత్రం వైసీపీలో కీలకమైన నాయకుడిగా మారిపోయారు..


ఉమ్మడి రాష్ట్రంలో సీఎం క్యాండెట్‌గా ఫోకస్ అయిన బొత్స

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్ తదనంతరం ఒకానొక దశలో సీఎం క్యాండెట్‌గా ఫోకస్ అయన అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ.. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల నాటికి అందరిలా వైసీపీలో చేరడానికి సంశయించారు. అయితే 2019 ఎన్నికల నాటికి జగన్ పక్షాన చేరిన ఆ సీనియర్ నాయుకుడు జగన్ క్యాబినెట్‌ బెర్త్ దక్కించుకుని.. అయిదేళ్లు మంత్రి పదవిలో కొనసాగి తనదైన మార్క్ చూపించారు. ఇక గత ఎన్నికల్లో చీపురుపల్లిలో పరాజయం పాలైనప్పటికీ జగన్ ఆయనకు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించి, మండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా కల్పించారు.

ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్‌గా పని చేసిన బొత్స సత్యనారాయణ

అలా వైసీపీలో అనేక కీలక పదవులను నిర్వర్తిస్తూ జగన్ కి అత్యంత ముఖ్యమైన నాయకుడిగా మారిపోయారు.. బొత్సకి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ఎలా విమర్శలు చేయాలో, ఆ విమర్శలకు ఎలా కౌంటర్ వేయాలో బాగా తెలుసు.. అందుకే ప్రస్తుతం వైసీపీలో ఉన్న సీనియర్ నాయకుల అందరి తీరు వేరు బొత్స తీరు వేరు అంటారు.. బొత్స ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశారు.. దీనికి తోడు రాజకీయంగా విశేష అనుభవం కలిగిన నాయకుడిగా పేరు ఉంది.. అంతేకాకుండా ఉత్తరాంధ్రాలో బలమైన బీసీ నేతగా ఉన్న బొత్స ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం రేసులో ఉన్న నాయకుడిగా పేరు ప్రచార జరిగిందంటేనే బొత్స సత్యనారాయణకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..

వైసీపీలో సర్దుకుని పోతూ కీలక నేతగా మారిన బొత్స

జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ అప్పట్లోనే తన సతీమణి బొత్స ఝాన్సీని ఎంపిగా గెలిపించుకున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీ ఒక వెలుగు వెలిగింది. తర్వాత ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసిపిలో చేరినా.. రాజకీయాల్లో సర్దుబాట్లు అనేవి చాలా ముఖ్యం కావడంతో ఒకింత సర్దుకుపోతున్న బొత్స.. పార్టీలో మాత్రం తన పట్టు పెంచుకుంటూ వచ్చి జగన్ తర్వాత కీలకమైన నాయకుడిగా మారారు.

బొత్సకు సముచిత గౌరవం ఇస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్

బొత్స సత్యనారాయణ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత బొత్సకు ఇవ్వాల్సిన గౌరవం జగన్ ఇస్తూనే వస్తున్నారు.. ఎక్కడా కూడా వైయస్ జగన్ బొత్స సత్యనారాయణను చిన్నచూపు చూసినట్లు కనిపించలేదు.. ముఖ్యంగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బొత్సను ఐదేళ్లు మంత్రిగా కొనసాగించారు.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన తర్వాత కూడా బొత్సకు ఇవ్వాల్సిన మర్యాదను జగన్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.. బొత్సను ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించారు.. వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆయన కూడా మెంబర్ గా నియమించారు.. పార్టీకి సంబంధించిన పదవులతో పాటు విశాఖ నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించి మండలికి పంపించి ప్రతిపక్ష నాయకుడిని చేయడంతో ఇప్పుడు బొత్స వైసిపిని తన భుజాలపై వేసుకుని నడిపించే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు..

సంక్షోభ సమయంలో కీలకంగా వ్యవహరిస్తున్న బొత్స

ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకుడైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో బాధ్యతలు తీసుకుని జరిగిన నష్టాన్నిపూడ్చుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తే ఆ రాజకీయ పార్టీ నిలబడడంతో పాటు నాయకుడు కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది.. ఇప్పుడు వైసీపీలో బొత్స సత్యనారాయణ అలాంటి రోల్ పోషిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.. గత ఆరు నెలల కాలంలో మొత్తం వైసీపీ తరఫున బాధ్యతలు తీసుకున్నట్లు బొత్స మాట్లాడుతున్నారు .. ఖచ్చితంగా వైసీపీ 2029లో అధికారంలోకి వస్తుందని కుండ బద్దలు కొట్టినట్టు స్టేట్మెంట్ ఇస్తున్నారు.. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గట్టిగానే విమర్శిస్తున్నారు.. దీంతోపాటు వైసీపీలో కమిటీల నియామకానికి సంబంధించి జగన్‌కు సీనియర్ నాయకుడుగా దిశా నిర్దేశం కూడా చేస్తున్నారని వైసీపీ క్యాడర్లో జోరుగా ప్రచారం జరుగుతుంది

కేసుల్లో ఇరుక్కొంటున్న జగన్ వీర విధేయులు

ప్రస్తుతం వైసీపీ పీకల్లోతు కష్టాల్లో ఉందన్నది తెలిసిందే.. వైసిపి ఓటమి చెందిన వెంటనే పార్టీలో అనేకమంది కీలకమైన సీనియర్ నాయకులు రాజీనామా చేసి కూటమి పార్టీలో జాయిన్ అయిపోయారు.. కీలకమైన నాయకులు పార్టీని విడిచి వెళ్ళిపోతుంటే వైసీపీ పని అయిపోయిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.. మరో వైపు జగన్ వీరవిధేయులు వరుసగా కేసుల్లో ఇరుక్కుని ఒకరి తర్వాత ఒకరు జైలు బాట పడుతుండటంతో క్యాడర్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. కొంతమంది నాయకులు తమ మీద కేసులు పెడతారేమో అనే భయంతో సైలెంట్ గా ఉండిపోతున్నారు.. వైసీపీలో అత్యంత సీనియర్ నాయకుడుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారిపై కూడా కేసుల ఉచ్చు బిగియడం, ఆయన కొడుకు ఎంపీ మిథున్‌రెడ్డి, మరో జగన్ సన్నిహితుడు చెవిరెడ్డి వంటి వారు లిక్కర్ స్కాంలో జైల్లో ఉన్నారు.

బొత్స పెద్దన్న పాత్రతో వైసీపీ క్యాడర్లో ఉత్సాహం

కూటమి ప్రభుత్వం కేసులను చూపించి వైసిపి నాయకులను పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని పట్టుదలతో ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు వైసీపీని పుట్టగతులు లేకుండా చేస్తామని అంటూనే ఉన్నారు. అలాంటి సమయంలో బొత్స సత్యనారాయణ వైసీపీలో పెద్దన్న పాత్ర పోషిస్తూ జగన్ కు అండగా నిలుస్తుండడంతో పార్టీ క్యాడర్ లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోందంటున్నారు.. ఒక్క కేసు కూడా లేని బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కూటమి ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను తప్పుపడుతున్నారు.. 2024 ఎన్నికల ముందు వరకు వైసీపీలో కీలకమైన నాయకులుగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్లు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయినా వైసీపీ తరఫున పెద్ద గొంతుకుగా , కూటమి ప్రభుత్వాన్ని తన విమర్శలతో ఇరకాటంలో పెడుతున్న సీనియర్ నాయకుడుగా ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఒక్కరే కనిపిస్తున్నారు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా ఫోకస్ అయిన అప్పటి జగన్ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు సైతం ప్రస్తుతం సౌండ్ చేయటానికి సంశయిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

పాత కేసులకు తోడే ఏపీ లిక్కర్ స్కాం చట్రంలో జగన్

కూటమి ప్రభుత్వం వైసీపీని ఇరకాటంలో పెట్టడానికి జగన్‌ని సైతం జైలుకు పంపే అవకాశం ఉందంటున్నారు. జగన్‌పై ఉన్న పాత కేసులతో పాటు ఇప్పడు లిక్కర్ స్కాం ఉచ్చు కూడా బిగుసుకుంటుందన్న వాదన వినిపిస్తుంది. వైసీపీలో అలాంటి సంక్షోభంలో ఉన్న తరుణంలో బొత్స సత్యనారాయణ పార్టీలో కీలకమైన వ్యక్తిగా మారి తనకున్న అనుభవంతో పార్టీ చెక్కుచెదరకుండా నాయకులను సమన్వయం చేయగలరని, జగన్ నమ్మే స్థాయికి బొత్స చేరుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నావాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి బొత్స సత్యనారాయణ చేతే వెల్లడింపచేశారు.

Also Read: ఉలిక్కిపడ్డ మంజునాథుడి భక్తులు.! వందల మంది చావులకి కారణమేంటి.?

సీనియర్ నాయకుడుగా ఉన్న బొత్స సత్యనారాయణ ద్వారా అయితేనే ప్రజలకు విషయాన్ని చేరే వేసే విషయంలో క్రెడిబిలిటీ ఉంటుందని భావిస్తారనే ప్రచారం ఉంది.. ప్రస్తుతం ఆ క్రెడిబిలిటీని వాడుకుంటూ 2029 ఎన్నికల నాటికి బొత్సని ఒక ఉత్తరాంధ్రకే పరిమితం చేయకుండా, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయనకు మరిన్ని కీలకమైన బాధ్యతలు అప్పగించి, బొత్స సీనియారిటీని ఉపయోగించుకుంటారనే ప్రచారం జరుగుతుంది.. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా లాయల్టీ గా వ్యవహరించే బొత్స సత్యనారాయణ ముందు ముందు వైసీపీలో ఎలాంటి కీలక పాత్ర వహిస్తారో చూడాలి.

Story By Venkatesh, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×