BigTV English

Beat Body Odor : ఇలా చేస్తే చెమట వాసన మాయం

Beat Body Odor :  ఇలా చేస్తే చెమట వాసన మాయం
Beat Body Odor

Beat Body Odor : సాధారణంగా ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడో లేక ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడో చెమట వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మన శరీరంలో ఎక్కువగా వేడి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ వేడిని మన బాడీ చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. ఇలా వేడిని బయటికి పంపించడం వల్ల మన శరీరం చల్లగా మారుతుంది. కొందరిలో అయితే చీటికీ మాటికీ చెమట వస్తుంటుంది. చెమటతో పాటు చెడు వాసన ఎక్కువగా వస్తుంది. సాధారణంగా మానవ శరీరంలో అనేక శ్వేద గ్రంథులు ఉంటాయి. ఇవి మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తాయి.


అయితే మన చంక భాగంలో ఉండే శ్వేద గ్రంథులు చాలా యాక్టీవ్‌గా పనిచేస్తాయి. అందుకే ఆ ప్రాంతంలో అధికంగా చెమట వస్తుంది. చెమటలో అధికంగా ఉండే యాంటీ యాసిడ్లు, ప్రొటీన్ల వల్ల మన బట్టలపైనా మరకలు ఏర్పడుతుంటాయి. మన శరీరం చేసే ముఖ్యమైన పనుల్లో చెమటను బయటికి పంపించి వేయడం కూడా ఒకటి. చెమటలోని రసాయనాలు మనల్ని పలు రకాల వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఇందులోని సహజసిద్ధమైన యాంటీ బయోటిక్స్‌ క్రిముల్ని నశింపజేసి మన శరీరాన్ని రోగాల బారినపడకుండా కాపాడుతాయి. కొందరిలో ఈ చెమట రావడం ఎక్కువగా ఉంటుంది. దాన్ని హైపర్‌ హైడ్రోసిస్‌ అని పిలుస్తారు. అంతేకాకుండా వీరిలో చెమట చెడు వాసన రావడంతో పాటు పక్కవారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. మనకు కూడా ఎంతో అసౌకర్యంగా అనిపిస్తుంది.

చాలా మంది చెమట వాసన రాకుండా ఉండేందుకు డియోడరెంట్లు, పలు రకాల పర్ఫ్యూమ్‌లు ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే పలు రసాయనాలు మనకు ఎంతో హాని చేస్తాయని నిపుణులు అంటున్నారు. పర్ఫ్యూమ్‌లను ఎక్కువగా వాడితే రొమ్ము క్యాన్స‌ర్, చ‌ర్మ క్యాన్స‌ర్లు వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అందుకే డియోడరెంట్లకు బదులు సహజ సిద్ధంగా తయారు చేసిన పదార్థాలను వాడితే మంచిది. సహజసిద్ధంగా దుర్వాసనను పోగొట్టడంలో నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం ఆధారంగా నిమ్మ‌కాయ‌ను డియోడ‌రెంట్‌గా వాడితే చెమ‌ట వాస‌న రాదు. మామూలుగా పండిన ఓ నిమ్మకాయను సగానికి కట్‌ చేసుకుని చంక కింది భాగంగా బాగా రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చెమట వాసన రాదు.


అంతేకాకుండా చర్మానికి కూడా ఎలాంటి హానీ ఉండదు. నిమ్మకాయలోని ఆమ్లాలు ఎక్కువ చెమట ఉత్పత్తికాకుండా చేస్తాయి. ఇలా మనకు సహజసిద్ధమైన డియోడరెంట్లుగా పనిచేస్తాయి. నిమ్మ‌కాయ‌ల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌ ల‌క్ష‌ణాలు ఎక్కువగాఉండటం వల్ల చెమట వాసన కూడా రాదు. అధిక చెమట వస్తున్నా.. దుర్వాసన ఉన్నా నిమ్మకాయను వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×