BigTV English

Benefits of Castor Oil : ఆముదం నూనెతో ఆరోగ్య ప్రయోజనాలివే

Benefits of Castor Oil : ఆముదం నూనెతో ఆరోగ్య ప్రయోజనాలివే

Benefits of Castor Oil : నిత్యం మనం వాడే అనేక రకాల నూనెల్లో ఆముదం ఒకటి. ఈ ఆముదం గింజల నుంచి తీసిన నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు ఆముదం బాగా ఉపయోగపడుతుంది. మలబద్దకం ఉన్నవారు ఆముదాన్ని తాగితే విముక్తి కలుగుతుంది. ఆముదంలోని రికినోలీయిక్ యాసిడ్ పేగుల గోడలను మృదువుగా చేస్తుంది. పేగుల్లో మలం సులభంగా కదిలి బాగా విరోచనం అవుతుంది. ఆర్థరైటిస్ నొప్పులు ఉంటే ఆముదం బాగా పనిచేస్తుంది. ఆముదాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట రాస్తే ఎలాంటి నొప్పి అయినా వెంటనే తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలోని పలు హార్మోన్లు బాగా పనిచేయాలంటే ఆముదం తీసుకుంటే కొవ్వు పదార్థాలను శరీరం బాగా శోషించుతుంది. హార్మోన్లు బాగా పనిచేస్తాయి. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆముదం తాగడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మన బాడీలో టాక్సిన్లు, బాక్టీరియాలకు వ్యతిరేకండా పోరాడగలిగిన లింఫోసైట్ల ఉత్పత్తిని ఆముదం పెంచుతుంది. దీని వల్ల మన రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుంది. కాలిన గాయాలు, ఇన్‌ఫెక్షన్లు ఆముదం రాయడం వల్ల తొందరగా మానుతాయి. ఆముదాన్ని నిత్యం తలకు రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది. చర్మానికి రాస్తే పగలకుండా ఉంటుంది. అంతేకాకుండా మృదువుగా అవుతుంది.


Tags

Related News

Yoga Benefits: యోగాతో మహిళలకు కలిగే.. ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు !

Makhana For Diabetes: మఖానా తింటే.. షుగర్ మటుమాయం !

After Brushing: బ్రష్ చేసిన వెంటనే ఆ..పని చేస్తున్నారా? అయితే త్వరగా మానేయండి

Sugar Vs Jaggery: బెల్లం Vs పంచదార.. ఏది తింటే బెటర్ ?

Digital Screens: బ్లూ లైట్‌‌తో వృద్ధాప్యం.. జాగ్రత్త పడకపోతే అంతే.. !

Aluminium Utensils: అల్యూమినియం పాత్రలు వాడితే.. ఇంత డేంజరా ? ఈ రోజే బయట పడేయండి

Big Stories

×