Air Purifiers: మెల్లమెల్లగా శీతాకాలం మొదలవుతుంది.. దీనికి వాయుకాలుష్యం కూడా తోడవుతుంది. ముఖ్యంగా, మెట్రో నగరాల్లో నివసించే వారికి శీతాకాలంలో వాయు కాల్యుష్యం స్థాయి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో స్వచ్ఛమైన, తాజా గాలిని పీల్చుకోవడం నిజంగా సవాలుతో కూడుకున్న పనే. దీంతో చాలామంది ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడాలనుకుంటారు. ఇవి ఇంట్లో గాలిని కాలుష్య రహితంగా మార్చుతాయి. కాబట్టి.. సామాన్యులు కూడా కొనగలిగేలా రూ.5వేల లోపు లభించే బెస్ట్ ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై ఓ లుక్కేద్దాం రండి..
శీతాకాలంలో తీవ్రమైన పొగమంచు వల్ల ఇంట్లోకి హానికరమైన వాయుకాలుష్యం చేరుతాయి. వాటికి చెక్ పెట్టాలంటే.. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడాల్సిందే. ఇవి ఇంట్లోని ధూళి, పొగ, హానికరమైన కణాలను ఫిల్టర్ చేసి, ఇంటి వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి.
ఈ ఎయిర్ ఫ్యూరిఫైయర్‌ను అమెజాన్ నుండి రూ.3,599 ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ (NexLev Smart Air Purifier) దాదాపు 200 చ.అ. వరకు ఇల్లు, కార్యాలయ వినియోగానికి అనువైనది. ఇది కూడా HEPA ఫిల్టర్‌తో వస్తుంది. ఈ ఫ్యూరిఫైయర్ 99.99% వైరస్‌లు, దుమ్ము, పొగ, వాసనలు, అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాలను తొలగిస్తుంది. దీనికి 3 ఏళ్ల వారంటీ కూడా లభిస్తుంది.
ఇది అమెజాన్‌లో రూ.3,044 ధరకే లభిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్(Xiaomi Smart Air Purifier) అమెజాన్‌లోని సమాచారం ప్రకారం..99.99% వాయు కాలుష్య కారకాలను తొలగిస్తుంది. 3-లేయర్ ఫిల్టర్‌తో వస్తోన్న ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ పెంపుడు జంతువుల వెంట్రుకలు, వాసనలను తొలగిస్తుంది.
దీనిని అమెజాన్ నుండి రూ.4,199 ధరకే కొనుగోలు చేయవచ్చు. HEPA H13 ఫిల్టర్‌తో వస్తోన్న ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ (Bepure B1 Air Purifier) దాదాపు 500 చదరపు అడుగుల వరకు ఉన్న ప్రదేశంలో సరిపోతుంది. ఇది ఇల్లు, కార్యాలయాలకు అనువైనది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ 99.97% కాలుష్య కారకాలను తొలగిస్తుంది. సులభంగా వాడటానికి ఇది రిమోట్ కంట్రోల్‌తో కూడా వస్తుంది.
ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను అమెజాన్ నుండి రూ.4,998 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్(Honeywell Air Purifier) ఇల్లు, కార్యాలయం వినియోగానికి అనువైనది. ఇది H13 HEPA ఫిల్టర్ తో 99.99% కాలుష్య కారకాలు, అలెర్జీ కారకాలు, పొగ, దుమ్ము, పుప్పొడిని తొలగిస్తుంది. ఇది 235 చదరపు అడుగుల వరకు ఉన్న ప్రాంతానికి సరిపోతుంది.
గమనిక: ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ల ఆఫర్లు, దరలు ప్రతిరోజూ మారవచ్చు. కొత్త ఆఫర్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించగలరు.