Chicken Majestic: చికెన్ మజెస్టిక్ అనేది ఆంధ్ర , తెలంగాణ ప్రాంతాల్లో చాలా ఫేమస్ అయిన స్టార్టర్. బయట క్రిస్పీగా, లోపల జ్యుసీగా ఉండే ఈ చికెన్ ముక్కలను పెరుగు, మసాలా సాస్‌లో వేయించడం వల్ల దీని రుచి అద్భుతంగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్‌లో ఈ మజెస్టిక్ చికెన్‌ను ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
తయారీకి కావలసిన పదార్థాలు:
మ్యారినేషన్ కోసం:
బోన్‌లెస్ చికెన్- (సన్నటి స్ట్రిప్స్)- 300 గ్రాములు
కార్న్ ఫ్లోర్- 3 టీస్పూన్లు
అల్లం-వెల్లుల్లి పేస్ట్-1 టీస్పూన్
మిరియాల పొడి – 1 టీస్పూన్
ఎగ్ వైట్ -1
ఉప్పు – రుచికి సరిపడా
నూనె (వేయించడానికి)- సరిపడా
వెల్లుల్లి (సన్నగా తరిగినది)- 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి (నిలువుగా చీల్చినవి)2-3
కరివేపాకు-1 రెబ్బ
ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి)- 4 టీస్పూన్లు
పసుపు- చిటికెడు
కారం పొడి- 1/2 టీస్పూన్లు
జీలకర్ర పొడి- 1/2 టీస్పూన్దు
ధనియాల పొడి- 1 టీస్పూన్లు
పెరుగు -1/2 కప్పు
కొత్తిమీర, పుదీనా ఆకులు- తగినంత
Also Read: క్రిస్పీ ఆమ్లెట్.. వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి
తయారీ విధానం: బోన్ లెస్ చికెన్‌ను శుభ్రంగా కడిగి, సన్నటి పొడవాటి ముక్కలుగా (స్ట్రిప్స్‌గా) కట్ చేయండి. తరువాత ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, గుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాలు పక్కన ఉంచండి. చికెన్ ఫ్రై చేయడం ఒక పాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, మంటను మధ్యస్థంగా ఉంచి, మ్యారినేట్ చేసిన చికెన్ స్ట్రిప్స్‌ను కొద్దికొద్దిగా వేసి, బంగారు వర్ణం వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.
వేగిన చికెన్ ముక్కలను టిష్యూ పేపర్‌పై తీసి పక్కన పెట్టుకోవాలి. (మజెస్టిక్ రుచికి చికెన్ క్రిస్పీగా ఉండటం చాలా ముఖ్యం). సాస్, ఫైనల్ పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి, లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. మంటను తగ్గించి, పసుపు, కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత, పుల్లని పెరుగును గడ్డలు లేకుండా బాగా గిలకొట్టి పాన్‌లో వేసి త్వరగా కలపాలి. (పెరుగు వేసిన తర్వాత మంట చాలా తక్కువగా ఉండాలి లేదా స్టవ్ ఆపివేయాలి. లేదంటే పెరుగు విరిగిపోతుంది).చివరగా.. వేయించిన చికెన్ ముక్కలను, కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులను వేసి, సాస్ మొత్తం చికెన్‌కు పట్టేలా త్వరగా టాస్ చేయాలి. వేడి వేడిగా ప్లేట్‌లోకి తీసుకుని, నిమ్మకాయ ముక్కలతో అలంకరించి సర్వ్ చేస్తే, రుచికరమైన యమ్మీ చికెన్ మజెస్టిక్ సిద్ధం.