ఈ రోజుల్లో విమాన ప్రయాణం సర్వసాధారం అయ్యింది. అయితే, మహిళలు ప్రెగ్నెంట్ అయిన తర్వాత విమానం ప్రయాణం చెయ్యొచ్చా? ప్రెగ్నెన్సీ వయసు ఎంత వరకు ఉంటే వెళ్లవచ్చు? ఎన్ని నెలల ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్లకూడదు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గర్భిణీలు విమాన ప్రయాణం చేయవచ్చు. కానీ, కొన్ని జాగ్రత్తలు, ఆంక్షలు పాటించాల్సి ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీ వయసు, ఆరోగ్య పరిస్థితి, ఎయిర్‌లైన్ నియమాలు మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి 14-28 వారాల ప్రెగ్నెన్సీ మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా విమాన ప్రయాణం చెయ్యొచ్చు. ఈ సమయంలో అబార్షన్, ప్రీ టర్మ్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. గర్భిణీలు విమానం ప్రయాణం చేయడానికి ముందు గైనకాలజిస్టును తప్పని సరిగా కలవాలి. రెండోది ఎయిర్ లైన్ పాలసీ గురించి వివరంగా తెలుసుకోవాలి. వాటికి అనుగుణంగా తమ ప్రయాణాలను సాగించాలి.
⦿1-28 వారాలు: ఈ వయసు ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా విమాన ప్రయాణం చెయ్యవచ్చు. ఎలాంటి సమస్య లేకపోతే డాక్టర్ సలహా కూడా అవసరం లేదు. కానీ, ముందు జాగ్రత్తగా డాక్టర్ ను కలవడం మంచిది.
⦿29-36 వారాలు: ఈ సమయంలో చాలా ఎయిర్ లైన్స్ డాక్టర్ సర్టిఫికేట్స్ అడుగుతాయి. 35 వారాల తర్వాత చాలా వరకు ప్లైయింగ్ కు అనుమతించవు.
⦿36 వారాల తర్వాత: అత్యవసరం అయితే తప్ప విమాన సంస్థలు అనుమతించవు.
⦿ రక్తం గడ్డకట్టడం(DVT): ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ప్రతి 2 గంటలకు ఓసారి నడవాలి. అవసరం అయితే, కూర్చున్నప్పుడు కాళ్లు ముందుకు చాపాలి.
⦿ ఆక్సీజన్ తక్కువ: 28 వారాల గర్భం ఉన్న వారికి ఇది పెద్ద సమస్య కాదు.
⦿ ప్రీ-టర్మ్ లేబర్ ప్రమాదం: ఈ సమస్య 36 వారాల తర్వాత ఎక్కువగా ఉంటుంది.
⦿ ఎయిర్ ఇండియా: 28 వారాల తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ తో అనుమతిస్తుంది. 36 వారాల తర్వాత అనుమతి లేదు.
⦿ ఇండిగో: 32 వారాల తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ అడుగుతుంది. 36 వారాల తర్వాత ప్రయాణానికి అనుమతి ఇవ్వడం లేదు.
⦿ స్పైస్ జెట్ : ఈ సంస్థ కూడా 28 వారాల తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ అడుగుతుంది. 36 వారాల తర్వాత అనుమతి ఇవ్వడం లేదు.
Read Also: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!
⦿ సీట్ బెల్ట్ కడుపు కింద పెట్టుకోవాలి.
⦿ సులువుగా నడవడానికి ఐస్ల్ సీట్ సెలెక్ట్ చేసుకోండి.
⦿ డీహైడ్రేషన్ కలగకుండా ఎక్కువ నీరు తాగాలి.
⦿ రక్త ప్రసరణ కోసం కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం మంచిది.
Read Also: వీర్యం రంగు మారుతుందా? ఆ కలర్ లో ఉంటే అంతే సంగతులు!