E-Paper
Advertisement

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గండిలా ?

Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గండిలా ?
Advertisement

Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఊబకాయం అనేది ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది మరింత కష్టమవుతుంది. నడుము, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు శరీరాన్ని అందవిహీనంగా మారుస్తుంది. అంతే కాకుండా ఇది అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

పొట్ట చుట్టూ ఉన్న బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు కొన్ని అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలి. అంతే కాకుండా లైఫ్ స్టైల్ లో మార్పులు కూడా అవసరం. మరి అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బెల్లీ ఫ్యాట్ తగ్గించే మార్గాలు..

1. సమతుల్య ఆహారం:
పండ్లు, కూరగాయలు, పప్పులు , తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. అంతే కాకుండా ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం వల్ల బరువు తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

Advertisement

2. ప్రోటీన్ తీసుకోవడం:
ప్రోటీన్ కండరాల నిర్మాణంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్ మొదలైనవి ప్రోటీన్ యొక్క మంచి వనరులు. వీటిని తరుచుగా తినడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.

3. చక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారం:

ప్రాసెస్ చేసిన ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి కారణం అవుతాయి. అందుకే చెక్కర ఉన్న పదార్థాలను తినడం వీలైనంత వరకు తగ్గించారు. జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది.

4. రెగ్యులర్‌గా వ్యాయామం:
రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ మొదలైనవి చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కార్డియో వ్యాయామాలు చేయాలి. ఇవి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి.

5. యోగా, ధ్యానం:

యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒత్తిడి కూడా అధిక బరువు సమస్యకు ఓ కారణం. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుంది. అందుకే బరువు తగ్గాలని అనుకునే వారు తరుచుగా యోగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Also Read: లవంగాలతో మతిపోయే లాభాలు!

6. తగినంత నిద్ర:
రాత్రిపూట కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది అంతే కాకుండా ఆకలిని పెంచుతుంది. చాలా మంది అవసరమైన దానికంటే ఎక్కువ తింటూ ఉంటారు. ఇది తరువాత ఊబకాయానికి కారణం అవుతుంది.

7. తగినంత నీరు త్రాగడం:
శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. నీరు జీవక్రియను పెంచుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. నీరు బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

8.ఒత్తిడిని తగ్గించుకోండి:

ఒత్తిడిని నివారించడానికి యోగా, ధ్యానం, సంగీతం వినడం వంటివి చేయవచ్చు. ఒత్తిడి కార్టిసాల్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది. ఇది పొట్ట దగ్గర ఉన్న కొవ్వును పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఓపిక చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. ఫలితాలు ఒక్క రోజులోనే రావు కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా నెమ్మదిగా బరువు తగ్గుతారు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×