BigTV English
Advertisement

YS Jagan: పిన్నెల్లే దిక్కయ్యారా?.. జగన్ వ్యూహమేంటి?

YS Jagan: పిన్నెల్లే దిక్కయ్యారా?.. జగన్ వ్యూహమేంటి?

పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మరోసారి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వసం సహా వివిధ కేసులు నమోదయ్యాయి. దాంతో పరారైన పిన్నెల్లి చివరకు పోలీసులకు దొరికి నెల్లూరు జిల్లా రిమాండ్ అనుభవించి షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చారు.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాచర్ల రావడానికి కొన్ని కండిషన్స్ ఉండటంతో ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా మరో నేతికి వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం లభిస్తుందని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చినా.. స్వేచ్ఛగా తిరుగుతూ పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గా నిర్వహించే పరిస్థితి లేదు.


అందుకే పిన్నెల్లి స్థానంలో కొత్త నేతకి పగ్గాలు అప్పగిస్తారని వైసీపీ వర్గాలు భావించాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్న సమయంలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య కూడా పోటీ నడిచింది. రేసులో గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కాసు మహేష్‌రెడ్డి , మోదుగుల వేణుగోపాల్ రెడ్డిల పేర్లు ఫోకస్ అయ్యాయి.  వైసీపీ అధిష్టానం వారి పేర్లు పరిశీలిస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరిగింది. అయితే కొందరు మాత్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అవకాశం కల్పించ వద్దని అధిష్టానానికి విన్నపాలు కూడా చేశారంట.

ఆ క్రమంలో మోదుగోలకు వేణుగోపాల్ రెడ్డికి అవకాశం లభిస్తుందని పార్టీలో సీనియర్లు సైతం భావంచారు. వేణుగోపాల్ రెడ్డికి అధ్యక్ష పదవితో పాటు మాచర్ల ఇన్చార్జి బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ నడిచింది. దానికి కారణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేకపోవడమే అని  అదీకాక నియోజవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయినట్లు టాక్ నడిచింది.

Also Read: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

అయితే జగన్ మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికే మరోసారి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు .. దాని వెనుక అధిష్టానం ఆలోచన వేరే విధంగా ఉందంటున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అందుకే పిన్నెల్లి నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు జగన్ బెంగళూరు నుంచి హుటాహుటిన వచ్చి ఆయన్ని పరామర్శించి వెళ్లారు. పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టడాన్ని సమర్ధించి పిన్నెల్లి మంచోడని కితాబు కూడా ఇచ్చారు.

జగన్‌తో అంత సాన్నిహిత్యం ఉన్న పిన్నెల్లి ముందు నుంచి ఆయనతోనే ఉన్నారు … జగన్ కోసం 2012లో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలిచార. పాఅత్యధిక సార్లు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిగా కూడా పిన్నెల్లికి ముద్ర ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మార్చి మరొకరికి అవకాశం ఇస్తే ఓడిపోయారు కాబట్టి మార్పులు చేశారన్న ప్రచారంతో పార్టీ మరింత డ్యామేజ్ అవుతుందని జగన్ భావిస్తున్నారంట. అదీకాక పిన్నెల్లి కూడా జగన్‌ను అధ్యక్ష పదవిలో కొనసాగించమని వేడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. లేకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆ ఫ్యాక్షన్ లీడర్ వార్నింగ్ కూడా ఇచ్చారంటున్నారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాకుండా మరో నేతకి అవకాశం ఇచ్చినా ప్రస్తుతానికైతే వైసీపీకి చేకూరే ప్రయోజనమేదీ లేదు. అందుకే కొంత కాలం కొద్ది రోజులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగించి తర్వాత పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు గురించి ఆలోచించ వచ్చని జగన్ లెక్కలు వేసుకుంటున్నట్లు చెప్తున్నారు. అదీకాక ఇప్పటికిప్పుడు పిన్నెల్లిని పక్కన పెడితే ఆయన పార్టీకి దూరమయ్యే అవకాశమందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న నాయకుల్ని కూడా దూరం చేసుకుంటే కష్టమని జగన్ ఆయనకే అవకాశమిచ్చారని అంటున్నారు.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×