BigTV English

Devara Movie : ఫ్యాన్ వార్స్ ఆపండి, అలా అని మాట ఇవ్వండి.. ఎన్‌టీఆర్ అభిమానులకు ‘దేవర’ టీమ్ రిక్వెస్ట్

Devara Movie : ఫ్యాన్ వార్స్ ఆపండి, అలా అని మాట ఇవ్వండి.. ఎన్‌టీఆర్ అభిమానులకు ‘దేవర’ టీమ్ రిక్వెస్ట్

Devara Movie : కొందరు టాలీవుడ్ హీరోలకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో మాత్రమే దేశవ్యాప్తంగా వీరికి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి భారీ ఫ్యాన్‌‌ బేస్ సంపాదించుకున్న హీరోల్లో ఎన్‌టీఆర్ కూడా ఒకరు. నందమూరి వారసుడిగా అడుగుపెట్టిన ఎన్‌టీఆర్.. కొన్నాళ్లకే తన యాక్టింగ్‌తో, స్క్రిప్ట్ సెలక్షన్‌తో తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ‘దేవర’ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు ఒక రిక్వెస్ట్ పంపించారు డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ.


బాధ్యత తీరిపోయింది

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వెండితెరపై ఎన్‌టీఆర్‌ను చూసే అవకాశం అభిమానులకు రాలేదు. అంతే కాకుండా ఎక్కువగా ఈవెంట్స్‌లో కూడా ఆయన కనిపించలేదు. అందుకే ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లడానికి చాలామంది ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. అలాగే వెళ్లారు కూడా. కానీ అభిమానుల వల్లే ఆ ఈవెంట్ చివరి నిమిషంలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ‘దేవర’ రిలీజ్‌కు ముందు ఎన్నో ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతున్నాయి. అందుకే ఇవన్నీ ఆపడం కోసం ఎన్‌టీఆర్ అభిమానులను ఉద్దేశ్యం ఒక స్పెషల్ ట్వీట్ చేశాడు నాగవంశీ. ‘తారక్ అన్న చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ కంటెంట్ మాస్ కంటెంట్‌తో వస్తున్నారు. మంచి కంటెంట్ ఇవ్వడంలో ఆయన బాధ్యత పూర్తయ్యింది’ అని చెప్పుకొచ్చాడు.


Also Read: క్రేజ్, క్యాష్ కోసమే తెలుగు సినిమాలు… ఈ హిందీ స్టార్లకు తెలుగు ప్రమోషన్ లలో పాల్గొనడం నమోషి

చాలాకాలం తర్వాత

‘దేవరను భారీ ఎత్తున విడుదల చేయడానికి మా వల్ల అయినంత కష్టపడ్డాం. ఏపీ ప్రభుత్వం సహాయంతో ఆ రాష్ట్రంలో చాలాకాలం తర్వాత సినిమా బెనిఫిట్ షోలు ప్రారంభం కానున్నాయి. మా రిక్వెస్ట్ ఏంటంటే.. మీరు కూడా బాధ్యతతో ప్రశాంతంగా ఉండండి. అనవసరమైన ఫ్యాన్ వార్స్ ఆపండి. దీని వల్ల సినిమాపై కేవలం నెగిటివిటీ మాత్రమే ఏర్పడుతుంది. కాసేపటి వరకు ఇలాంటివన్నీ కిక్ ఇచ్చినా కూడా తర్వాత అవి మన హీరోల సినిమాలనే ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే ఫ్యాన్ వార్స్ ఆపమని అందరి అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమాతో అయినా ఫ్యాన్స్ వార్స్ ఆపేస్తామని, సినిమాలపై నెగిటివిటీ పెరిగేలా చేయమని మాటిద్దాం’ అంటూ ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చాడు నాగవంశీ.

వీడియోలు వద్దు

‘అంతే కాకుండా దేవర ఫ్యాన్ షోలకు వెళ్తున్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. థియేటర్లలో మీ పక్కన కూర్చున్నవాళ్లను కూడా వీడియోలు తీయనివ్వకండి. మీ తర్వాత సినిమా చూస్తున్న ఫ్యాన్స్ కూడా థ్రిల్ అవ్వనివ్వండి. తారక్ అన్నపై ప్రేమ, అభిమానంతో దేవరను గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ చేద్దాం. ఇది మనందరికి పెద్ద విషయం. దేవర సెప్పిండు అంటే సేసినట్టే’ అంటూ ‘దేవర’పై ప్రేక్షకుల్లో ఉన్న హైప్‌ను మరింత పెంచేశాడు నాగవంశీ. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయినా, తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ‘దేవర’ను ఆపేవారే లేరని ప్రీ బుకింగ్స్ చూస్తుంటే అర్థమవుతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×