విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడంతో పాటు సామాజిక సేవలోనూ మేమున్నాం అంటున్నది BIG TV. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రజలు ఈ అవకాశాన్ని వినయోగించుకోవాలంటున్నది.
⦿ నెల్లూరు జిల్లా నాయుడుపేట- ఫిబ్రవరి 23
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. రంగుల ప్రపంచాన్ని చూడాలంటే కళ్లే ముఖ్యం. కంటి చూపు లేకపోతే జీవితమంతా చీకటే. ఆ చీకటిని దూరం చేసేందుకు నడుంబిగించింది BIG TV. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడు పేటలో BIG TV, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించనుంది. ఫిబ్రవరి 23, ఆదివారం నాడు వేమా ఇంగ్లీష్ మీడియం ఆవరణలో శ్రీవెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ సహకారంతో మెగా కంటి పరీక్షా, ఆపరేషన్ శిబిరం ఏర్పాటు చేయబోతున్నది.
ఫిబ్రవరి 23న ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట లో బిగ్ టీవీ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం pic.twitter.com/HzQUZBQwyj
— BIG TV Breaking News (@bigtvtelugu) February 8, 2025
⦿ తిరుపతి జిల్లా నారాయణవనం- ఫిబ్రవరి 16
ఇక తిరుపతి జిల్లా నారాయణవనం జిల్లా పరిషత్ బాలికల స్కూల్ లో BIG TV మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబోతున్నది BIG TV. DBR &SK హాస్పిటల్ సౌజన్యంతో ఈ నెల 16 తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నది. ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో అనుభవజ్ఞులైన డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, మందులు ఉచితంగా అందించనున్నారు.
⦿ గుంటూరు జిల్లా నిడుబ్రోలు- ఫిబ్రవరి 9
ఇక గుంటూరు జిల్లాలో BIG TV మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబోతున్నది. పొన్నూరు నియోజకవర్గం నిడుబ్రోలులో 185వ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనుంది. బాలాజీ హాస్పిటల్ సౌజన్యంతో శివాలయం దగ్గర ఈ నెల 09న ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, మందులను అందించనున్నారు.
⦿ చిత్తూరు జిల్లా వి కోట- ఫిబ్రవరి 13
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి కోట మండలంలో BIG TV మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనుంది. P E S మెడికల్ కాలేజీ సౌజన్యంతో V కోట జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఈ నెల 13న ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఇందులో ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు అందించనున్నారు.
⦿ ఖమ్మం జిల్లా బుగ్గపాడు- ఫిబ్రవరి 9
ఇక ఖమ్మం జిల్లా వాసుల కోసం BIG TV ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నది. డాక్టర్ వనమా లక్ష్మణ్ సాయి సహకారంతో ఎల్విఆర్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఈ నెల 9న ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలుతో పాటు ఉచితంగా మందులు అందించనున్నారు.
⦿ హైదరాబాద్ జిల్లా మియాపూర్- ఫిబ్రవరి 9
ఇక హైదరాబాద్ లోని మియాపూర్ నడిగడ్డ తాండాలో BIG TV ఉచిత వైద్యశిబిరం నిర్వహించనుంది. ఫిబ్రవరి 9న రోజున నడిగడ్డ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించనున్నారు. ఈ మెడికల్ క్యాంపులను ఉపయోగించుకోవాలని BIG TV యాజమాన్యం తెలిపింది.
Read Also: ఉడికించిన చిలగడదుంప తింటే జరిగేది ఇదే.. మీరు అస్సలు ఊహించి ఉండరు