BigTV English
Advertisement

Bollywood Heroine: వేల కోట్ల ఆస్తి.. చివరికి అనాధగా మిగిలిన శవం.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

Bollywood Heroine: వేల కోట్ల ఆస్తి.. చివరికి అనాధగా మిగిలిన శవం.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

Bollywood Heroine.. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఆ తర్వాత వేలకోట్లు కూడబెట్టిన వారు ఉన్నారు. మరి కొంత మంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రాజా భోగాలు అనుభవించి చివరికి అనాధలా మరణించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ప్రధమంగా వినిపించే పేరు మహానటి సావిత్రి (Mahanati Savitri). ఇండస్ట్రీలో కోటీశ్వరులుగా పేరు దక్కించుకున్న ఈమె, చివరి దశలో ఎవరూ లేని అనాధగా మరణించింది. అందుకే ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీల జీవితాలకు గ్యారెంటీ లేదు అనే మాటలు నెటిజన్స్ నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక హీరోయిన్ కి వందల కోట్ల ఆస్తి ఉంది. కానీ జీవితం మాత్రం విషాదంగా మిగిలింది. ఆమె ఎవరో కాదు అందాల తార , తన అందం అభినయంతో ఒకతరం ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ప్రముఖ నటి విమి (Vimi).


ఉన్నతంగా బ్రతికి, చివరికి అనదలా మిగిలింది..

ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ క్వీన్ గా ఒక పేరు దక్కించుకున్న ఈమె ,మోసాలు, వేధింపులకు గురై చివరికి ఆర్థికంగా చితికిపోయింది. ఆమె జీవితం ఒక్కసారిగా చీకటిమయం అయిపోయింది. 1960లో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈమె.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా అందం విషయంలో చెక్కుచెదరలేదు. మంచి టాలెంట్ కూడా ఉండడంతో విజయం ఆమెను వరించింది. కెరియర్ లైఫ్ బాగున్నా..వ్యక్తిగత జీవితం మాత్రం ఈమెను మరింత బాధ పెట్టింది. భర్త వదిలేశాడు. ఇంకొక వ్యక్తి మోసం చేశాడు. దాంతో దయనీయ పరిస్థితులలోకి జారిపోయింది. ఆమె పతనం ఎంత దారుణం అంటే చివరకు చిల్లి గవ్వలేని స్థితిలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని స్మశానానికి తీసుకెళ్లడానికి కూడా దిక్కులేక , సరుకులు రవాణా చేసే బండిని, ఆమె శవాన్ని తరలించడానికి వాడాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీలో ఆమె ఎంతలా మోసపోయిందో అర్థం చేసుకోవచ్చు.


విమి కెరియర్..

విమి విషయానికి వస్తే.. 1943లో సిక్కు కుటుంబంలో జన్మించింది. సింగింగ్లో శిక్షణ తీసుకుంది. చదువుకుంటున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు కూడా పాడేది. ముంబైలో సోఫియా కాలేజీలో సైకాలజీ పూర్తి చేసిన ఈమె ఒక రిచ్ బిజినెస్ ఫ్యామిలీ కి చెందిన శివ్ అగర్వాల్(Shiv Agarwal) ను వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. విమి జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో అనుకోని కష్టాలు ఆమెను పలకరించాయి. ఇక ఈమె బాలీవుడ్లోకి రావడం ఒక ఊహించని విధంగానే జరిగింది. సంగీత దర్శకుడు రవి, ఆమెను పాపులర్ డైరెక్టర్ బి.ఆర్ చోప్రా కి పరిచయం చేశారు. 1967లో హామ్ రాజ్ అనే చిత్రంలో హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఓవర్ నైట్ లోనే విమి స్టార్ హీరోయిన్ అయిపోయింది. పలు మ్యాగజైన్లు కూడా ఈమె ఫోటోలను పబ్లిష్ చేశాయి. ఇక కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తో పాటు విజయం కూడా ఆమెను వరించింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కొన్ని చిత్రాలు ఆమెకు డిజాస్టర్ ను అందించాయి. ఇక కెరియర్ పడిపోతున్న సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. ఒక వ్యక్తిని నమ్మి, ఆ చిన్న నిర్మాతతోనే సహజీవనం చేసి డబ్బు పూర్తిగా పోగొట్టుకుంది. ఆఖరికి విమి టెక్సటైల్ అనే తన పేరు మీద ఉన్న బిజినెస్ ని కూడా అమ్మి అప్పులు తీర్చుకుంది. కానీ చివరికి దివాలా తీసి, ఒంటరి తనాన్ని గడిపింది. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఉన్నత జీవితాన్ని అనుభవించి చివరికి ఎవరూ లేని అనాధగా మరణించడం నిజంగా బాధాకరమనే చెప్పాలి.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×