E-Paper
Advertisement

డాక్టర్లకు షాకిచ్చిన పిల్లి.. మృత్యు సమయాన్ని ముందుగానే చెప్పే మార్జాలం

డాక్టర్లకు షాకిచ్చిన పిల్లి.. మృత్యు సమయాన్ని ముందుగానే చెప్పే మార్జాలం
Advertisement

ఒక పిల్లి వైద్య రంగంలో నిపుణులకు ఆశ్చర్యపరిచింది. ఈ పిల్లి చేసిన అద్భుతాల కథలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పిల్లి ఒక వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడో కచ్చితమైన సమయం చెప్పేది. అమెరికాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో ఆస్కార్ అనే పిల్లి ఉండేది. ఈ పిల్లి రోగుల మరణాన్ని ముందే గుర్తించేది. డాక్టర్లు, సిబ్బంది దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.

ఆస్కార్ పిల్లి ఎవరు

ఆస్కార్ ఒక థెరపీ క్యాట్. ఇది అమెరికాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో గంభీరంగా అనారోగ్యంతో ఉన్న రోగుల సంరక్షణలో ఉండేది. సాధారణంగా ఆస్కార్ మనుషులతో పెద్దగా కలిసేది కాదు. కానీ రోగుల వద్దే ఉండేది. రోగి పరిస్థితి విషమించినప్పుడు మాత్రం దాని ప్రవర్తన మారిపోయేది.

ఆస్కార్ విచిత్ర ప్రవర్తన సిబ్బందిని షాక్ చేసింది

Advertisement

ఆస్పత్రి సిబ్బంది ఒక విచిత్ర విషయాన్ని గమనించారు. పరిస్థివి సీరియస్‌గా ఉన్న రోగి గదిలోకి ఆస్కార్ పిల్లి నిశ్శబ్దంగా వెళ్లి రోగి పక్కన పడుకునేది. కొన్ని గంటల తర్వాత ఆ రోగి మరణించేవాడు. ఈ సంఘటన చాలా సార్లు పునరావృతమైంది. డాక్టర్లు దీన్ని తీవ్రంగా పరిగణించసాగారు.

ఆస్కార్ కచ్చితత్వం డాక్టర్లను అందరినీ ఆశ్చర్యపరిచింది

ఆస్కార్ 100కి పైగా మరణాలను సరిగ్గా గుర్తించిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ కచ్చితత్వం సీనియర్ డాక్టర్లను కూడా విస్మయం చేసింది. ఈ ప్రవర్తనకు సులభమైన వివరణ ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాలేదు.

సైంటిఫిక్ కారణాలు

Advertisement

నిపుణులు ఇది అతీంద్రియ శక్తి కాదని చెబుతున్నారు. మరణిస్తున్న కణాలు కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయని ఒక సిద్ధాంతం. పిల్లులు వాటిని సులభంగా వాసన చూడగలవు. రోగి శ్వాస, కదలికల్లో మార్పులను కూడా ఆస్కార్ గమనించి ఉండవచ్చు.

రోగులకు ఆస్కార్ ఎలా ఓదార్పు ఇచ్చేది

ఆస్కార్ ఉనికి.. రోగులు భయపడే వారు కాదు. చివరి క్షణాల్లో వారికి ఓదార్పును ఇచ్చేది. నిశ్శబ్దంగా పక్కన కూర్చుని ఉండేది. రోగి కుటుంబ సభ్యులు కూడా పిల్లితో సాన్నిహిత్యంగా ఉండేవారు. రోగులు ఒంటరిగా లేరని భావన కలిగించేది.

ఆస్కార్‌ను నమ్మిన డాక్టర్లు

మొదట డాక్టర్లు గందరగోళం చెందారు. కానీ పదేపదే ఇదే జరగడంతో వారు దాని ప్రవర్తనను నమ్మేవారు. ఆస్కార్ రోగి పక్కన కూర్చుంటే డాక్టర్లు కూడా ఇక రోగి త్వరలోనే చనిపోతాడని నమ్మి ఆ రోగి కుటుంబసభ్యులను పిలిచి చివరి మాటలు చెప్పే అవకాశం ఇచ్చేవారు.

Also Read: పెళ్లి, పార్టీకి వెళ్లే ముందు ముఖంపై మొటిమలు వచ్చేసాయా? వెంటనే ఇలా చేయండి

ఆస్కార్ సామర్థ్యం గురించి వివాదం

కొందరు ఇది కేవలం యాదృచ్ఛికం అని అంటారు. మరికొందరు మనుషులు గమనించలేని మార్పులను జంతువులు గుర్తించగలవని చెబుతారు. అసలు కారణం ఇప్పటికీ తెలియదు. అయితే ఆస్కార పిల్లి 2022లో చనిపోయింది.

ఆస్కార్ వారసత్వం

ఆస్కార్ గురించి మేకింగ్ రౌండ్స్ విత్ ఆస్కార్ అని పుస్తకం కూడా రాశారు. ఆస్కార్ కథ మీడియాలో, పుస్తకాల రూపంలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. 2022లో ఆస్కార్ మరణించింది. ఇప్పటికీ దీని కథ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది.

Related News

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×