Meal maker cutlets: సాయంత్రం వేళ వర్షం పడుతున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ మధ్యలో చిన్నగా ఆకలేస్తున్నా వేడివేడి కట్లెట్స్ తింటే.. ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది కదా! మిల్మేకర్ లేదా సోయా చంక్స్ అన గానే చాలా మంది కర్రీస్, బిర్యానీలే గుర్తొస్తాయి కానీ, వీటితో కట్లెట్స్ చేస్తే రుచి మాత్రం అస్సలు ఊహించలేనంత బాగుంటుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ స్నాక్ ప్రతి ఒక్కరికీ ఇట్టే నచ్చేస్తుంది. కిచెన్‌లో.. ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ టైమ్‌లోనే ఈ ట్రెండీ స్నాక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం!
మిల్మేకర్ : 1 కప్పు
బంగాళదుంపలు: 1 లేదా 2 చిన్నవి
ఉల్లిపాయ: 1 చిన్నది
పచ్చిమిర్చి: 1 లేదా 2
కొత్తిమీర: కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీ స్పూన్
ఉప్పు: రుచికి తగినంత
కారం: 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
గరం మసాలా లేదా చాట్ మసాలా: కొద్దిగా
కార్న్ ఫ్లోర్ లేదా శనగపిండి: 2 స్పూన్లు
బ్రెడ్ కమ్స్ లేదా రవ్వ: క్రిస్పీ కోటింగ్ కోసం కొద్దిగా
నూనె: వేయించడానికి..
1.ముందుగా వేడినీళ్లలో మిల్మేకర్ వేసి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత చల్లని నీళ్లతో.. కడిగి, నీళ్లు అస్సలు లేకుండా గట్టిగా పిండేయాలి. నీళ్లు ఉంటే కట్లెట్స్ షేప్ సరిగ్గా రాదు, నూనెలో విడిపోతాయి. ఇలా గట్టిగా పిండిన మిల్మేకర్‌ని మిక్సీలో కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ముద్దలా కాకుండా ఉంటే బెటర్.
2. తర్వాత ఒక బౌల్‌లో గ్రైండ్ చేసిన మిల్మేకర్, మెత్తగా మాష్ చేసిన బంగాళ దుంప, ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి, కొత్తి మీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా లేదా చాట్ మసాలా వేయాలి. దానికి 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ లేదా శనగ పిండి వేసి నీళ్లు పోయకుండా బాగా.. కలిసేలా ఒత్తుకోవాలి. మిశ్రమం మరీ లూజ్‌గా అని పిస్తే కొంచెం బ్రెడ్ కమ్స్ లేదా శనగ పిండి కలుపుకోవచ్చు. ఫ్లేవర్స్ పట్టడానికి 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
3.చేతికి కొద్దిగా నూనె రాసుకుని, మీడియం థిక్‌నెస్‌లో రౌండ్‌గా.. లేదా ఓవల్ షేప్‌లో కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. (మరీ మందంగా చేస్తే.. లోపల సరిగ్గా వేగదు, మరీ పల్చగా చేస్తే.. త్వరగా మాడి పోతుంది). వీటిని మైదా లేదా కార్న్ ఫ్లోర్ స్లరీలో ముంచి, బ్రెడ్ కమ్స్‌లో దొర్లిస్తే బయట క్రిస్పీగా వస్తుంది.
4. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేయాలి. వేసిన వెంటనే.. కదపకుండా ఒక నిమిషం ఆగి, తర్వాత మెల్లగా తిప్పుతూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. (డీప్ ఫ్రై ఇష్టం లేనివాళ్లు షాలో ఫ్రై లేదా ఎయిర్ ఫ్రయర్‌లో కూడా నూనె స్ప్రే చేసి చేసుకోవచ్చు). వేడి వేడిగా ఉన్నప్పుడే గ్రీన్ చట్నీ లేదా టమాటో కెచప్‌తో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి.