E-Paper
Advertisement

మెట్రోకు పోటీగా PRTS.. హైదరాబాద్‌లో మరో కొత్త ట్రాన్స్‌ పోర్ట్ సిస్టమ్!

మెట్రోకు పోటీగా PRTS.. హైదరాబాద్‌లో మరో కొత్త ట్రాన్స్‌ పోర్ట్ సిస్టమ్!
Advertisement

Hyderabad PRTS Project: హైదరాబాద్‌ లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో కొత్త రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. సిటీలో 35 కిలోమీటర్ల పొడవున పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. దీనివల్ల ముఖ్యమైన ప్రాంతాల మధ్య ప్రయాణం సులభం కావడంతో పాటు రోడ్లపై వాహనాల రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు.

కూకట్‌పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు ఫస్ట్ ఫేజ్!

ప్రతిపాదిత PRTS ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో కూకట్‌పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ మార్గం రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ మీదుగా వెళ్లనుంది. మొత్తం 35 కిలోమీటర్ల ప్రతిపాదిత నెట్‌ వర్క్‌ లో 64 స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నగరంలోని ఐటీ కారిడార్‌ తో పాటు ఇతర కీలక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

సీఎం సూచనతో ప్రాజెక్ట్ పనులు వేగవంతం

Advertisement

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా PRTS సాధ్యాసాధ్యాలను పరిశీలించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సమావేశంలో అధికారులు ప్రతిపాదిత ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.

2050 నాటికి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం

హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు నగరంలో భవిష్యత్ ప్రయాణికుల అవసరాలపై అంచనాలు రూపొందించారు. 2030 నాటికి  రోజుకు 3.94 లక్షల మంది ప్రయాణికులు, 2040 నాటికి రోజుకు 7.96 లక్షల మంది ప్రయాణికులు, 2050 నాటికి  రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తారని భావిస్తున్నారు.

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి

Advertisement

PRTS ప్రాజెక్టును సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న మెట్రో, రైల్వే వంటి రవాణా సదుపాయాలను కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై నిపుణులు, ప్రాజెక్టు భాగస్వాములతో చర్చలు వేగవంతం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పురపాలక శాఖ, ఇంధన శాఖ, దక్షిణ మధ్య రైల్వే, హైడ్రా (HYDRAA) విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు PRTS ప్రాజెక్టు మరో ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉంది. ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also: అక్వాన్ తుఫాను ఎఫెక్ట్.. ఈస్ట్ కోస్ట్, ఫలక్‌నుమా రైళ్ల కొత్త టైమింగ్స్ ఇవే!

Tags

Related News

అక్వాన్ తుఫాను ఎఫెక్ట్.. ఈస్ట్ కోస్ట్, ఫలక్‌నుమా రైళ్ల కొత్త టైమింగ్స్ ఇవే!

దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. రైళ్లు రద్దు, విమాన సర్వీసులకు బ్రేక్!

ఆకాశంలో ఇక విమానాల సందడే.. మరో 1,000 విమానాలు వచ్చేస్తున్నాయ్!

ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా? ఈ 4 తప్పులు చేస్తే ప్రమాదమే

ఆత్మవిశ్వాసమే అతని ఆయుధం.. కళ్లు కనిపించకపోయినా ఎవరెస్ట్ ఎక్కేశాడు

ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ హైడ్రామా.. 9 గంటలైనా కదలని విమానం!

లక్షద్వీప్ నుంచి అండమాన్ వరకు.. భారత్‌ లో స్కూబా డైవింగ్‌ కు 6 బెస్ట్ ప్లేసెస్ ఇవే!

Big Stories

Advertisement
×