E-Paper
Advertisement

పులివేషాల సంస్కృతి మాటున ప్రతీకార జ్వాలలు… ఓటీటీలోకి సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్

పులివేషాల సంస్కృతి మాటున ప్రతీకార జ్వాలలు… ఓటీటీలోకి సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Kannada Action Drama on OTT: ఇటీవల కన్నడ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న ప్రాంతీయ నేపథ్య కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా అక్కడి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కథల్లో భాగం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కోవలో మంగళూరు తీర ప్రాంతపు సంస్కృతి, దసరా వేడుకల్లో కనిపించే ‘పులివేషం’ సంప్రదాయం నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘మార్ణమి’ (Maarnami). ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ చైత్ర జె. ఆచార్, రిత్విక్ మఠద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు? ఇందులో పులివేషం వెనుక దాగిన కథేంటి? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కర్ణాటకలోని మంగళూరు తీర ప్రాంతానికి చెందిన ఓ గ్రామంలో ఈ కథ సాగుతుంది. చిన్నతనంలో చేతు (రిత్విక్ మఠద్) అనారోగ్యానికి గురవుతాడు. దీంతో తన కొడుకు కోలుకుంటే మార్ణమి పండుగ సందర్భంగా పులివేషం వేయిస్తానని తల్లి జలజ (సోనూ గౌడ) మొక్కుకుంటుంది. అయితే తల్లి మరణం చేతు జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపుతుంది. మేనమామ వసంతన్న (ప్రకాష్ తుమినాడ్) అండతో పెరిగి పెద్దవాడైన అతడు, ఇక జీవితంలో ఎప్పటికీ పులివేషం వేయకూడదని నిర్ణయించుకుంటాడు. అయినప్పటికీ వసంతన్నతో కలిసి పులివేషం బృందాన్ని నడిపిస్తూ జీవితం సాగిస్తుంటాడు.

Advertisement

ఈ క్రమంలో చేతు జీవితంలోకి దీక్ష (చైత్ర జె. ఆచార్) ప్రవేశిస్తుంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తుంది. మరోవైపు ఊరిలో ఇంకో పులివేషం బృందాన్ని నడిపించే జ్యోతిష్ (జ్యోతిష్ శెట్టి)తో చేతుకు విభేదాలు మొదలవుతాయి. ఇరు బృందాల మధ్య పాత కక్షలు, స్థానిక ఆధిపత్య పోరు క్రమంగా పెరిగి పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఈ పరిణామాల వల్ల చేతు తన కుటుంబానికి సమయం కేటాయించలేకపోతాడు. దీంతో భార్య దీక్షతోనూ మనస్పర్థలు మొదలవుతాయి.

ఒకవైపు తన బృందాన్ని, తనను నమ్ముకున్నవాళ్లను శత్రువుల నుంచి కాపాడుకోవాలి. మరోవైపు తనకు దూరమవుతున్న భార్య ప్రేమను తిరిగి పొందాలి. ఈ రెండు సమస్యల మధ్య చిక్కుకున్న చేతు చివరకు ఏం చేశాడు? తన తల్లి మరణం తర్వాత దూరంగా పెట్టిన పులివేషాన్ని మళ్లీ ఎందుకు కట్టాల్సి వచ్చింది? తన శత్రువులపై ఎలా పోరాడాడు? అనేదే మిగతా కథ. మంగళూరు ప్రాంతపు సంప్రదాయాలను సహజంగా చూపిస్తూ, ఫ్యామిలీ ఎమోషన్స్, స్థానిక ఆధిపత్య పోరు, యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

‘మార్ణమి’ సినిమాలో రిత్విక్ మఠద్ చేతు పాత్రలో, చైత్ర జె. ఆచార్ దీక్షగా నటించారు. సోనూ గౌడ, ప్రకాష్ తుమినాడ్, జ్యోతిష్ శెట్టి, సుమన్ తల్వార్, స్వరాజ్ శెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. రిషిత్ శెట్టి దర్శకత్వం వహించగా, చరణ్ రాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైంది. 2026 నవంబర్ 18 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా తెలుగులో అందుబాటులో లేదు. ఒరిజినల్ కన్నడ ఆడియో, ఇంగ్లీష్ సబ్-టైటిల్స్‌తో మాత్రమే చూడటానికి వీలుంది.

Read Also: ఇంటి తలుపు తట్టిన పోలీసులు.. తలకిందులైన భార్య జీవితం.. దిమాక్ కరాబ్ చేసే క్రైమ్ థ్రిల్లర్

Related News

ప్రపంచాన్ని మారుస్తామని 8 బిలియన్ డాలర్ల కుంభకోణం.. ఇది చిన్న కథ కాదు భయ్యా

ఆన్‌లైన్‌లో అజ్ఞాత ప్రేమికుడు… కట్ చేస్తే కాలేజీ సూపర్ స్టార్… ఓటీటీలో ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ కామెడీ

తండ్రీకొడుకుల మధ్య ప్రాంక్ వార్.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన అసలు దొంగలు.. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్

మాయా లోకంలో మహా సంగ్రామం… శాపాన్ని ఛేదించడానికి యోధుల సాహస యాత్ర… ఫాంటసీ ప్రియులకు అసలైన విందు

నగరాన్ని వణికించే హంతకుడు… పోలీసులకు నిద్రలేని రాత్రులు… వెన్నులో వణుకు పుట్టించే సిరీస్

కాలేజీ క్యాంపస్‌లో మళ్లీ మొదలైన రచ్చ… ప్రేమ, స్నేహం, రాజకీయాలతో అదిరిపోయే సీజన్ 2… ఉచితంగా స్ట్రీమింగ్

బ్రేకప్ బాధతో వింత శపథం… 12 రాశుల అబ్బాయిలతో డేటింగ్… క్రేజీ రొమాంటిక్ సిరీస్

Big Stories

Advertisement
×