E-Paper
Advertisement

సామాన్యుల రీఛార్జ్ భారం తగ్గిస్తున్న BSNL.. రూ.172కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు!

సామాన్యుల రీఛార్జ్ భారం తగ్గిస్తున్న BSNL.. రూ.172కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు!
Advertisement

BSNL Voice Only Plans: మనలో చాలామంది ఇప్పటికీ కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే మొబైల్ వాడుతుంటారు. ముఖ్యంగా పెద్దవాళ్లు, సెకండరీ సిమ్ వాడేవాళ్లు ఇంటర్నెట్ డేటాతో పని లేకుండా తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారందరికీ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అదిరిపోయే శుభవార్త చెప్పింది. అసలు డేటా లేకుండా కేవలం అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లతో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ట్రాయ్ (TRAI) నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ అవసరం లేని కస్టమర్ల కోసం ప్రత్యేకంగా వీటిని డిజైన్ చేశారు. మరి ఈ ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయి, వీటి వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కొత్త ప్లాన్ల ధరలు, వ్యాలిడిటీ:

BSNL తాజాగా రూ.172, రూ.184, రూ.190 ధరలతో 3 స్పెషల్ టారిఫ్ వోచర్లను లాంచ్ చేసింది. వీటిలో తక్కువ ధరలో ఉన్న రూ.172 ప్లాన్ తీసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఒకవేళ మీకు పూర్తిగా 30 రోజుల వ్యాలిడిటీ కావాలంటే రూ.184 ప్లాన్ ఎంచుకోవచ్చు. ఇక రూ.190 రీఛార్జ్ చేసుకుంటే క్యాలెండర్ నెల మొత్తం వ్యాలిడిటీ వస్తుంది. అంటే.. మీరు ఏ తేదీన రీఛార్జ్ చేసుకుంటే మళ్లీ వచ్చే నెల అదే తేదీ వరకు ప్లాన్ పనిచేస్తుందన్నమాట.

రోజువారీ ఖర్చు, బెనిఫిట్స్:

Advertisement

ఈ మూడు ప్లాన్లలోనూ దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. రోజుకు 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. అయితే వీటిలో ఎలాంటి మొబైల్ డేటా రాదు. ఇక ఖర్చు విషయానికొస్తే రూ.172 ప్లాన్‌కు రోజుకు సుమారు రూ.6 కంటే కొంచెం ఎక్కువ పడుతుంది. రూ.184 ప్లాన్‌కు రోజుకు రూ.6.13 ఖర్చవుతుంది. ఇక రూ.190 ప్లాన్ రోజువారీ ఖర్చు ఆ నెలలో ఉండే రోజులను బట్టి మారుతూ ఉంటుంది.

Also Read: వాట్సప్ చాటింగ్ ఇక మరింత ఫన్.. మెసేజ్‌లకు స్టిక్కర్లతోనే రియాక్ట్ అయ్యే కొత్త ఫీచర్!

ట్రాయ్ నిబంధనల ప్రకారమే ఇదంతా:

Advertisement

డేటా అవసరం లేని కస్టమర్లపై భారం తగ్గించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల టెలికాం సంస్థలను ఆదేశించింది. అందుకే BSNLతో పాటు Jio, Airtel, Voda Phone (Vi) కూడా ఇలాంటి వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి. బీఎస్ఎన్ఎల్‌లో ఇప్పటికే రూ.99, రూ.439 ధరల్లో కూడా వాయిస్ ఫోకస్డ్ ప్లాన్లు ఉన్నాయి.

ఈ ప్లాన్లను ఎలా గుర్తించాలి?

మీరు డేటా ప్యాక్‌ల మధ్య గందరగోళం పడకుండా ఈ ప్లాన్లను సులభంగా ఎంచుకునే అవకాశం ఉంది. బీఎస్ఎన్ఎల్, జియో, వీఐ తమ వెబ్‌సైట్లు, యాప్‌లలో TRAI Mandated Packs అనే ప్రత్యేక సెక్షన్‌ను ఏర్పాటు చేశాయి. అక్కడికి వెళ్తే కేవలం కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఉండే ప్లాన్లన్నీ ఒకే చోట కనిపిస్తాయి. సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా బిగ్ సర్‌ప్రైజ్.. అకౌంట్ లేకపోయినా చాటింగ్ చేసేలా కొత్త యాప్!

Tags

Related News

రూ.8,299కే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

వాట్సప్ చాటింగ్ ఇక మరింత ఫన్.. మెసేజ్‌లకు స్టిక్కర్లతోనే రియాక్ట్ అయ్యే కొత్త ఫీచర్!

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా బిగ్ సర్‌ప్రైజ్.. అకౌంట్ లేకపోయినా చాటింగ్ చేసేలా కొత్త యాప్!

పార్టీ వైబ్స్‌కి కొత్త జోష్..ఫిలిప్స్ బ్లూటూత్ స్పీకర్ లాంచ్

భారీ బేస్,సూపర్ సౌండ్..సినిమా లవర్స్ కోసం టాప్ 5.1 హోమ్ థియేటర్లు!

కొత్త ఫోన్ కొనడం కంటే రిపేర్ చేసుకోవడమే బెటర్.. ఈ 5 లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆన్‌లైన్ క్లాసుల నుంచి కాలేజ్ ప్రాజెక్టుల దాకా..ఈ ల్యాప్‌టాప్‌లతో ఏ పనైనా ఈజీ

Big Stories

Advertisement
×