E-Paper
Advertisement

పక్షిలా కాళ్లపై పైకి గెంతి ఎగిరే డ్రోన్.. చూస్తే భలే ముచ్చటేస్తుంది

పక్షిలా కాళ్లపై పైకి గెంతి ఎగిరే డ్రోన్.. చూస్తే భలే ముచ్చటేస్తుంది
Advertisement

విమానాలు పక్షుల్లా ఎగురుతాయని తెలుసు. కానీ, అవి కాళ్లతో లేచి పైకి ఎగరవు. వాటి రెక్కలు కూడా పక్షుల్లా రెక్కల్లా కదలవు. అయితే, ఈ డ్రోన్ మాత్రం అచ్చం పక్షిలాగే ఎగురుతుంది. కాళ్లపై నుంచి పైకి లేచి.. సర్రున గాల్లోకి ఎగిరిపోతుంది. ఇది సాధారణ డ్రోన్ల కంటే చాలా భిన్నం. చూసేందుకు భలే చిత్రంగా ఉంటుంది. అయితే, ఇది దీన్ని ఇప్పుడు క్రియేట్ చేయలేదు. రెండేళ్ల కిందట.. రూపొందించారు. మరి, ఇప్పుడు ఎలా ఉందంటే?

అసలు ఏమిటీ.. పక్షి డ్రోన్?

పక్షి నేలపై నడవగలదు. అవసరమైతే గెంతుతూ గాల్లోకి కూడా ఎగిరిపోతుంది. ఎక్కడ నచ్చితే అక్కడ వాలిపోతుంది. ఇదే తరహా ఈ డ్రోన్ కూడా ఎగురుతుంది. దీన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు రూపొందించారు. 2024లో పక్షుల కదలికల స్ఫూర్తితో రావెన్(RAVEN) అనే ప్రత్యేకమైన డ్రోన్‌ను తయారు చేశారు. ఇది నేలపై నడుస్తూ.. దారిలో అడ్డంకులు ఏమైనా వస్తే గెంతుతూ.. రన్ వే అవసరం లేకుండానే.. నేరుగా గాల్లోకి ఎగిరింది.

మరి ఈ పరిశోధన ఆగిపోయిందా?

Advertisement

ఈ డ్రోన్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. టెక్ ప్రపంచంలో చర్చనీయమైంది. కానీ ఆ తర్వాత దాని ఊసే లేదు. బయటకు అప్ డేట్స్ ఇవ్వకపోయినా.. పరిశోధకులు మాత్రం దాన్ని సైలెంట్‌గా మరింత బాగా డెవలప్ చేశారు. మొదట్లో తయారు చేసిన పక్షి డ్రోన్లో కనిపించిన లోపాలను ఒక్కొక్కటి అధిగమనిస్తూ.. ఇప్పుడు మరో కొత్త పక్షి డ్రోన్‌ను తయారు చేశారు. 2004లో తయారు చేసిన డ్రోన్‌కు దీనికి.. చాలా తేడా ఉంటుంది.

RAVEN డ్రోన్‌కు ఏమైంది?

RAVEN అంటే రోబోటిక్ ఏవియన్ ఇన్స్‌పియర్డ్ వెహికిల్ ఫవర్ మల్టీ ఎన్విరాన్‌మెంట్స్ అని అర్థం. ఇప్పుడు మార్కెట్లలో ఉన్న డ్రోన్లకు కాళ్లు ఉండవు. కొన్నింటికి రన్ వే అవసరం. మరికొన్నింటిని గాల్లోకి విసరాలి. అందుకే పక్షుల కాళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అదే తరహాలో రోబిటిక్ కాళ్లను తయారు చేసి.. డ్రోన్‌కు అమర్చారు. దీంతో అది రన్‌వే లేకుండా.. దానికదే పైకి ఎగిరి గాల్లోకి వెళ్లిపోతుంది. ఎత్తైన ప్రదేశాల నుంచి కూడా దూకేస్తూ గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ పక్షి డ్రోన్ బరువు కేవలం 620 గ్రాములే. అంటే ఒక చిన్న నీళ్ల బాటిల్ అంత బరువు ఉంటుంది.

ఎక్కడైనా వాలొచ్చు.. ఎక్కడైనా ఎగరొచ్చు

Advertisement

వేగం అందుకొని గాల్లోకి ఎగరడానికి.. కొన్ని డ్రోన్లకు రన్‌వే అవసరం అవుతుంది. పైగా అవి ఎక్కడపడితే అక్కడ ల్యాండ్ కాలేవు. ఎక్కడైతే ఎగిరాయో తిరిగి అక్కడిగే ఎగురుకుంటూ రావాలి. కానీ, ఈ పక్షి రోబో మాత్రం గాళ్లతో పైకి గెంతి ఎగిరేస్తుంది. ఏ ప్లేస్‌లో అయినా కిందకి దిగి కాసేపు నడిచి.. మళ్లీ గెంతి పైకి ఎగిరేస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా చేతులతో పైకి ఎగరేయాల్సిన అవసరం లేదు. మానవ ప్రమేయం లేకుండానే.. దానికదే చేస్తుంది. అయితే, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం డ్రోన్ షోలలో వాడుతున్న డ్రోన్లు మాత్రం వాటికవే ఎగురుతాయి. మనుషులు ప్రత్యేకంగా ఎగరేయాల్సిన అవసరం లేదు.

RAVEN ప్లేస్‌లో ATROSA

2024లో RAVEN విజయవంతమైనా.. దాని తయారీలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంది. ముఖ్యంగా డ్రోన్‌కు కాళ్లను అమర్చే విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయి. డ్రోన్‌కు కాళ్లను అమర్చడం వల్ల దాని బరువు పెరిగింది. నడవడానికి, గెంతడానికి వేర్వేరు మోటార్లు, కంట్రోలర్లు అవసరం అయ్యాయి. దీంతో యంత్రాంగం కొంత క్లిష్టంగా మారింది. అందుకే, ఆ సవాళ్లను అదిగమిస్తూ.. కొత్త వెర్షన్ ATROSA (అట్రోసా) రంగంలోకి దిగింది. అంటే ఏరియల్ అండ్ టెర్రెస్ట్రియల్ రోబోట్ విత్ సింగిల్ యాక్యూటర్ అని అర్థం. ఇందులో ఉండే ఒకే మోటర్.. మూడు రకాల కదలికలను కంట్రోల్ చేయగలదు. ఇది ఆ డ్రోన్‌ను గెంతేలా చేయగలదు.. ఎగిరేలా కూడా చేయగలదు. రన్‌‌వేపై వేగం అందుకోవడం కోసం వీటికి కొత్తగా చక్రాలు కూడా ఏర్పాటు చేశారు. రన్ వే అందుబాటులో లేని ప్రాంతాల్లో మాత్రమే ఇది.. దానికదే పైకి ఎగిరి గాల్లోకి ఎగురుతుంది. ఇది రావెన్ కంటే చాలా తేలికైనది. దీని బరువు 279.49 గ్రాములే. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. ఎన్నో రకాల డ్రోన్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి, ఇది ఏవిధంగా ఆకట్టుకోగలదో చూడాలి.

Also Read: 49 ఏళ్ల ప్రయాణం.. భూమి నుంచి ఒక లైట్ డే దూరంలో వాయేజర్ 1.. ఇంతకీ ఏమిటిది?

Tags

Related News

గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీ..భారత్‌లో ఆపిల్ మ్యాప్స్ బిగ్ అప్‌డేట్

49 ఏళ్ల ప్రయాణం.. భూమి నుంచి ఒక లైట్ డే దూరంలో వాయేజర్ 1.. ఇంతకీ ఏమిటిది?

ఏఐ హెల్త్ అడ్వైస్..డాక్టర్ సలహా లేకుండా ఏఐని నమ్మి మోసపోకండి!

కొత్త హెయిర్ డ్రైయర్ కొనాలా? మీ జుట్టుకు తగిన మోడల్ ఇలా ఎంచుకోండి!

Airtel జాక్‌పాట్ ప్లాన్.. రూ.598కే నెట్ ఫ్లిక్స్, అపరిమిత 5G.. జీ5, హాట్ స్టార్ సైతం ఉచితం!

జియోలో పండగలాంటి ప్లాన్.. ఏడాది పాటు డైలీ 2.5GB డేటా.. కాల్స్, హాట్‌స్టార్, కాన్వా ప్రో ఫ్రీ!

భూమిని కుళ్లుకునేలా చేస్తున్న గ్రహం.. చుట్టూ ఏకంగా 285 చందమామలు.. అక్కడంతా వెన్నెల మయం!

Big Stories

Advertisement
×