E-Paper
Advertisement

సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్.. పంతులు, కోర్టు, మంత్రాలు ఏవీ లేకున్నా పెళ్లి జరుగుతుంది

సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్.. పంతులు, కోర్టు, మంత్రాలు ఏవీ లేకున్నా పెళ్లి జరుగుతుంది
Advertisement

Self Respect Wedding| పెళ్లంటే పంతులు, మంత్రాలు, మూడు ముళ్లు, ఏడడుగులు గుర్తుకొస్తాయి. మరికొందరు సంప్రదాయాలకు దూరంగా ఉండాలనుకుని కోర్టు మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు మరో రకమైన వివాహ విధానం చర్చనీయాంశంగా మారింది. ఇందులో పంతులు ఉండరు, మంత్రోచ్చారణలు ఉండవు, భారీ ఖర్చుతో కూడిన సంప్రదాయ వేడుకలు కూడా అవసరం లేదు. ఇద్దరి అంగీకారం, పరస్పర గౌరవమే ప్రధానంగా ఉంటాయి. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్. ఇంతకీ ఈ పెళ్లి విధానం ఎప్పుడు మొదలైంది? ఇందులో వివాహం ఎలా జరుగుతుంది?
చట్టపరంగా దీనికి గుర్తింపు ఉందా?

అనిరుధ్ రవిచందర్ పెళ్లితో మళ్లీ చర్చలోకి వచ్చిన విధానం

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, వ్యాపారవేత్త కావ్య మారన్ సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్ చేసుకున్నారనే వార్తలతో ఈ వివాహ విధానం మరోసారి వార్తల్లో నిలిచింది. తమిళనాడు మంత్రి డాక్టర్ టీఆర్‌బీ రాజా.. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వివాహ వేడుకలో ఇద్దరూ ఒకరికొకరు పూలమాలలు, చైన్లు మార్చుకున్నారు. దీంతో ఈ ప్రత్యేకమైన పెళ్లి విధానంపై చాలామందిలో ఆసక్తి పెరిగింది.

అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్ అంటే ఏమిటి?

Advertisement

సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్ అంటే స్వాభిమానం, సమానత్వం, పరస్పర అంగీకారానికి ప్రాధాన్యతనిచ్చే వివాహ విధానం. తమిళంలో దీన్ని ‘సుయమరియాదై తిరుమణం’ అని పిలుస్తారు. ఈ వివాహ విధానం వెనుక దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. 1925లో సామాజిక సంస్కర్త ఈవీ రామసామి నాయకర్ పెరియార్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
సమాజంలో కుల వివక్ష, పురుషాధిక్యతను ప్రశ్నించడం ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని కూడా పెరియార్ కోరుకున్నారు.

సంప్రదాయాల పేరుతో జరిగే వివక్షను తొలగించి, ప్రతి ఒక్కరికీ గౌరవం కల్పించాలనేది ఈ ఉద్యమ ఆశయం. అందులో భాగంగానే సెల్ఫ్ రెస్పెక్ట్ వివాహాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ఈ పెళ్లిలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి?

Advertisement

ఈ వివాహంలో సంప్రదాయ హిందూ పెళ్లిళ్లలో ఉండే పూజలు, మంత్రాలు, హోమాలు తప్పనిసరి కావు. అలాగే పెళ్లి జరిపించడానికి పంతులు కూడా అవసరం లేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సాక్షుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించుకోవచ్చు. పెళ్లి చేసుకునే ఇద్దరూ పరస్పర అంగీకారాన్ని ప్రకటిస్తారు. ఆ తర్వాత ఒకరికొకరు పూలమాలలు, ఉంగరాలు లేదా చైన్లు మార్చుకోవచ్చు. ఇందులో ఇద్దరి స్వేచ్ఛ, సమానత్వం, పరస్పర గౌరవమే ముఖ్యం.

Also Read: ఖర్చు చేసేటప్పుడు కుటుంబం, స్నేహితులకు స్పష్టమైన హద్దులు పెట్టండి.. ఆర్థిక క్రమశిక్షణకు 7 టిప్స్

ఈ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఎక్కడ ఉంది?

తమిళనాడులో సెల్ఫ్ రెస్పెక్ట్ వివాహాలకు ప్రత్యేక చట్టబద్ధమైన గుర్తింపు ఉంది. హిందూ వివాహ చట్టం, 1955లో సెక్షన్ 7-Aను చేర్చడం ద్వారా ఈ గుర్తింపు కల్పించారు. ఈ నిబంధన ప్రకారం.. నిర్ణీత విధానంలో బంధువులు, స్నేహితులు లేదా ఇతరుల సమక్షంలో వివాహం చేసుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఈ వివాహ విధానానికి గుర్తింపు ఉంది. అయితే, చట్టంలోని నిబంధనలు పాటించడం తప్పనిసరి.

Also Read: ఈ 5 రకాల వ్యక్తులను లవ్ చేయకూడదు.. మోసపోవడం ఖాయం

ఈ పెళ్లి విధానం ఎందుకు ప్రత్యేకం?

సంప్రదాయ వివాహాలకు భిన్నంగా తక్కువ ఖర్చుతో, సులభంగా పెళ్లి చేసుకునే అవకాశం ఈ విధానం కల్పిస్తుంది. ముఖ్యంగా కులం, మతపరమైన ఆచారాల కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తుంది.

వివాహ బంధంలో ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలనే సందేశాన్ని అందిస్తుంది. అందుకే ఆధునిక ఆలోచనలు కలిగిన జంటల్లో ఈ విధానంపై ఆసక్తి పెరుగుతోంది.

Related News

తాళాల గుత్తిలో సరైన తాళం చెవి దొరకడం లేదా? నో టెన్షన్ సింపుల్ ట్రిక్స్ ఇవిగో

పెళ్లిళ్లు, పార్టీల్లో అదిరిపోయే లుక్ కావాలా? లెహంగాతో ఈ 6 హెయిర్‌స్టైల్స్ ట్రై చేయండి

పైకి తీపి మాటలు, లోపల కుట్రలు.. ఈ 7 లక్షణాలు ఉన్నవారితో జాగ్రత్త..

ముక్కుపై బ్లాక్‌హెడ్స్‌తో ఇబ్బందిగా ఉందా? ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

రోజూ తినే ఎగ్ కర్రీ బోర్ కొట్టిందా?అయితే ఈ మెంతి కోడిగుడ్డు కూర ట్రై చేయండి!

మినప అప్పడాలు..ఇలా చేస్తే బయటి వాటి కంటే మంచి రుచి!

అమ్మమ్మల కాలం నాటి బీరకాయ రోటి పచ్చడి..సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ!

Big Stories

Advertisement
×