E-Paper
Advertisement

ఆకుకూర తినని వాళ్ళు కూడా..ఇష్టపడే పాలకూర పచ్చడి

ఆకుకూర తినని వాళ్ళు కూడా..ఇష్టపడే పాలకూర పచ్చడి
Advertisement

Palakura pachadi: మన తెలుగు వంటల్లో పచ్చళ్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. రోటి పచ్చళ్లు, తాలింపు పచ్చళ్లు, ఆకుకూర పచ్చళ్లు.. ఇవన్నీ సింపుల్‌గా కనిపించినా రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటాయి. పాలకూర సాధారణంగా సూప్స్, కర్రీస్, పరోటాల్లో ఎక్కువగా వాడుతుంటారు. కానీ పాలకూరతో.. చేసే పచ్చడిలో ఉండే ఫ్రెష్ ఫ్లేవర్, కొద్ది పాటి పులుపు, కారం కలిసి బోరింగ్ మీల్స్‌ని కూడా ఇట్టే ఎలివేట్ చేస్తాయి. బిజీ లైఫ్‌ స్టైల్‌లో హెల్దీగా, టేస్టీగా తినాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

తయారీ విధానం:

Advertisement

పాలకూర పచ్చడి బాగా రావాలంటే.. పాలకూర కట్టలు ఫ్రెష్‌గా, లేతగా ఉండేలా చూసుకోవాలి. ఆకులను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి, నీళ్లు పూర్తిగా పోయేలా జల్లెడలో ఉంచాలి. పాలకూరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మగ్గించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

1. పచ్చడి కోసం ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి పల్లీలు లేదా నువ్వులు, ఎండు మిర్చి లేదా పచ్చి మిర్చి, వెల్లుల్లి, జీల కర్ర వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో తరిగిన పాల కూర వేసి, మరీ ఎక్కువసేపు.. కాకుండా రంగు మారకుండా త్వరగా మగ్గించాలి.తర్వాత చింతపండు లేదా నిమ్మ రసం కొద్దిగా యాడ్ చేస్తే పాలకూరలోని.. స్వభావానికి చక్కని బ్యాలెన్స్ వస్తుంది. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసి, మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకుంటే టెక్స్చర్ బాగుంటుంది.

Advertisement

2. పచ్చడి రుచిని డబుల్ చేసేది పోపు లేదా తాలింపు. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేడి నూనెలో వేయించి పచ్చడిలో కలిపితే ..ఆ ఘుమాయించే వాసనకే ఆకలి పెరిగిపోతుంది. కొందరు పచ్చడి రుబ్బేటప్పుడే.. కొద్దిగా కొత్తి మీర లేదా పుదీనా కూడా కలుపుతుంటారు. దీనివల్ల ఫ్రెష్‌నెస్ ఇంకా పెరుగుతుంది. పచ్చడిని మరీ నీళ్లలా కాకుండా, అన్నంలో కలపడానికి లేదా టిఫిన్‌లో ముంచుకోవడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీలో ఉంచుకోవడం బెస్ట్.

ఆరోగ్య ప్రయోజనాలు:

పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ A, విటమిన్ C, యాంటీఆ క్సిడెంట్లు, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. పచ్చడి రూపంలో.. తీసుకునేటప్పుడు నూనె, ఉప్పు, కారం మోతాదును మన చేతిలోనే ఉంచుకోవచ్చు. వెయిట్ మేనేజ్‌మెంట్ లేదా హెల్దీ ఈటింగ్ ఫాలో అయ్యేవాళ్లు నూనె తక్కువగా వాడి, నువ్వులు లేదా వేరు శనగలతో బ్యాలెన్స్ చేసుకుంటే పోషకాలతో పాటు సంతృప్తి కూడా లభిస్తుంది. ఆకుకూరలు తినడానికి ఇష్టపడని పిల్లలకు కూడా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి తినిపిస్తే ఈజీగా అలవాటు చేయొచ్చు.

Also Read: ప్రొటీన్ ప్యాక్డ్ మిల్మేకర్ కట్లెట్స్..టీ టైమ్‌కి కిర్రాక్ స్నాక్ రెసిపీ

నిల్వ :

పాలకూర పచ్చడిని ఫ్రెష్‌గా అప్పటికప్పుడు తింటే రుచి అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే సాధారణంగా రెండు మూడు రోజుల వరకు తాజాగా ఉంటుంది. కానీ తడి స్పూన్ వాడకుండా జాగ్రత్త పడాలి. సర్వింగ్ విషయానికి వస్తే, మధ్యాహ్నం భోజనంలో పప్పు లేదా రసం సైడ్ డిష్‌గా ఇది సూపర్‌గా సెట్ అవుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, మసాలా దోసె, జొన్న రొట్టె, లేదా చపాతీతో కూడా ఈ పచ్చడిని ట్రై చేయొచ్చు.

మొత్తానికి..సింపుల్ పదార్థాలతో, తక్కువ సమయంలో, హెల్దీగా చేసుకునే పాలకూర పచ్చడి మన డైలీ మెనూలో ఎప్పుడూ ఉండాల్సిన రెసిపీ. నెక్స్ట్ టైమ్ మార్కెట్‌లో ఫ్రెష్ పాలకూర కనిపిస్తే ..కొని తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేసి చూడండి.

Related News

ప్రొటీన్ ప్యాక్డ్ మిల్మేకర్ కట్లెట్స్..టీ టైమ్‌కి కిర్రాక్ స్నాక్ రెసిపీ

సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్.. పంతులు, కోర్టు, మంత్రాలు ఏవీ లేకున్నా పెళ్లి జరుగుతుంది

తాళాల గుత్తిలో సరైన తాళం చెవి దొరకడం లేదా? నో టెన్షన్ సింపుల్ ట్రిక్స్ ఇవిగో

పెళ్లిళ్లు, పార్టీల్లో అదిరిపోయే లుక్ కావాలా? లెహంగాతో ఈ 6 హెయిర్‌స్టైల్స్ ట్రై చేయండి

పైకి తీపి మాటలు, లోపల కుట్రలు.. ఈ 7 లక్షణాలు ఉన్నవారితో జాగ్రత్త..

ముక్కుపై బ్లాక్‌హెడ్స్‌తో ఇబ్బందిగా ఉందా? ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

రోజూ తినే ఎగ్ కర్రీ బోర్ కొట్టిందా?అయితే ఈ మెంతి కోడిగుడ్డు కూర ట్రై చేయండి!

Big Stories

Advertisement
×