E-Paper
Advertisement

మినప అప్పడాలు..ఇలా చేస్తే బయటి వాటి కంటే మంచి రుచి!

మినప అప్పడాలు..ఇలా చేస్తే బయటి వాటి కంటే మంచి రుచి!
Advertisement

Minapa appadalu recipe: భోజనంలో.. అప్పడాలకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పప్పు, చారు, సాంబార్ ఏది వండుకున్నా పక్కన నూనెలో వేయించిన లేదా కాల్చిన అప్పడాలు ఉండాల్సిందే. అయితే మార్కెట్లో.. దొరికే ప్యాకెట్ అప్పడాలలో కొన్నిసార్లు నాణ్యత లోపించడం లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి రసాయనాలు క లుపుతుంటారు. అందుకే.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మినపప్పుతో.. ఎంతో శుభ్రంగా, రుచికరంగా మినప అప్పడాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

మినప పప్పు లేదా మినప్పిండి – 1 కేజీ

Advertisement

ఉప్పు – రుచికి సరిపడా

అప్పడ కార్ఖార (పాపడ్ ఖార్ / సోడా ఉప్పు)-2 స్పూన్లు

Advertisement

జీలకర్ర లేదా వాము – 2 స్పూన్లు (రుచి, సువాసన కోసం)

మిరియాల పొడి లేదా కారం – కొద్దిగా (స్పైసీగా కావాలనుకుంటే)

నూనె లేదా నెయ్యి – పిండి కలుపుకోవడానికి కొద్దిగా

తయారీ విధానం:

1.మీరు మినప్పప్పు వాడుతున్నట్లయితే.. దానిని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పిండి గిర్నికిచ్చి మెత్తగా ఆడించుకోవాలి. ఒకవేళ రెడీమేడ్ మినప్పిండి వాడితే జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి అందులో ఉప్పు, సోడా ఉప్పు, జీలకర్ర వేసి బాగా కరిగించాలి. ఈ నీటిని కొద్ది కొద్దిగా మినప్పిండిలో పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పడాలు గుల్లగా, కరకరలా రావాలంటే.. పిండిని రోటి కట్టెతో లేదా చేతులతో బాగా కలపాలి. పిండి ఎంత మెత్తగా, సాఫ్ట్‌గా కలిపితే అప్పడాలు అంత బాగా వస్తాయి.

Also Read: వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉండే..కంది పచ్చడి

2.ఇలా కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత పిండి ఆరి పోకుండా తడి క్లాత్ కప్పి ఉంచాలి. అనంతరం చపాతీ పీటపై కొద్దిగా బియ్యం పిండి లేదా నూనె రాస్తూ, పూరీల కంటే చాలా పల్చగా అప్పడాల రూపంలో ఒత్తుకోవాలి. వత్తిన అప్పడాలను తెల్లటి కాటన్ క్లాత్ లేదా ప్లాస్టిక్ షీట్ పై పరిచి ఎండలో చక్కగా ఆరబెట్టాలి. అప్పడాలు పూర్తిగా ఎండిన తర్వాతే నిల్వ చేసుకోవాలి.

బజార్లో దొరికే అప్పడాలకు స్వస్తి చెప్పి, మీ చేతులతోతయారు చేసుకున్న కరకరలాడే మినప అప్పడాల రుచిని ఆస్వాదించండి. ఈ సారి ఈ సింపుల్ ప్రాసెస్‌ను ఫాలో అయి అప్పడాలు రెడీ చేసుకోండి.

Related News

అమ్మమ్మల కాలం నాటి బీరకాయ రోటి పచ్చడి..సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ!

చాక్లెట్లు, బొమ్మల ఆశ చూపించి పిల్లలను మోసం చేసే వారితో జాగ్రత్త.. తల్లిదండ్రులు ఈ 7 విషయాలు నేర్పాలి

మీకు తెలుసా నెమళ్లు విషపూరిత పాములను చంపి తిన్నా చనిపోవు.. ఎందుకంటే

తొలి పరిచయంలోనే ఆకట్టుకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఆకర్షణ ఎక్కువ

విదుర నీతి.. ఈ 4 గుణాలు ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి వస్తుంది.. డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు?

చలికాలంలో జుట్టు పొడిబారే సమస్య.. నో టెన్షన్ ఈ 4 రకాలపూలతో హెయిర్ కేర్ చేయండి

వివాహ బంధంలో ఒకరు మోసం చేస్తే విడిపోవాల్సిందినా? లేదా మోసం చేసిన వ్యక్తికి మరో అవకాశం ఇవ్వాలా?

Big Stories

Advertisement
×