E-Paper
Advertisement

‘జనవరి 12 విడుదల’ టాప్ ప్రొడ్యూసర్ చేతికి నైజాం రైట్స్..ఇక లాభాల పంటే?

‘జనవరి 12 విడుదల’ టాప్ ప్రొడ్యూసర్ చేతికి నైజాం రైట్స్..ఇక లాభాల పంటే?
Advertisement

January 12 Vidudala Movie: టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అనే నమ్మకం అందరిలో ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి తన సినిమాని విడుదల చేస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు. ఇక 2027 సంక్రాంతి సందర్భంగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)జనవరి 12 విడుదల(January 12 Vidudala) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ (Venkatesh)నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

జనవరి 12 విడుదల కోసం దిల్ రాజు..

ఇక వీరిద్దరూ బావా బామ్మర్దులు పాత్రలలో కనిపించబోతున్నారని, ఈ హీరోలకు జోడిగా కీర్తి సురేష్(Keerthy Suresh) కృతి శెట్టి (Kriti Shetty)సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కావడంతో అనిల్ రావిపూడి ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. పరువైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనవరి 12 విడుదల సినిమా నైజాం రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) కైవసం చేసుకున్నారు. ఈ సినిమా నైజాం రిలీజ్ రైట్స్ భారీ ధరలకే దిల్ రాజు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

దిల్ రాజు చేతికి నైజాం రిలీజ్ రైట్స్…

Advertisement

ఇక ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్స్ ద్వారా అధికారకంగా తెలియజేశారు. ఇక గతంలో మన శంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇక దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో దిల్ రాజు మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ హక్కులను ఈయన సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే జనవరి 12 విడుదల సినిమాపై మంచి అంచనాలో ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ హక్కులను దిల్ రాజు కైవసం చేసుకున్నారనే విషయం తెలియడంతో ఇక ఈ సినిమా ద్వారా కూడా దిల్ రాజుకి మంచి లాభాలే దక్కుతాయని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో ఐదో సినిమా కావటం విశేషం. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడికి ఇది రెండో సినిమా అనే సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడిని పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా కళ్యాణ్ రామ్ అనే సంగతి తెలిసిందే. ఇలా వీరి కాంబినేషన్లో జనవరి 12 విడుదల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

Also Read: టైం 100 నెక్స్ట్ ఇండియా కవర్ పేజీ పై బాలీవుడ్ బ్యూటీ.. రాజమౌళి ప్రశంసలు!

Related News

టైం 100 నెక్స్ట్ ఇండియా కవర్ పేజీ పై బాలీవుడ్ బ్యూటీ.. రాజమౌళి ప్రశంసలు!

ఏం టాలెంట్ గురూ.. సంయుక్త ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!

సమంత సీమంతం వేడుక ఏ పద్ధతిలో జరిగిందో తెలుసా?

ఈఎన్ఈ రిపీట్ లో ఎంతమంది గెస్ట్ లుగా నటించారో తెలుసా?

‘రామాయణ’ మూవీ క్రేజే వేరయా.. మరో సెన్సేషనల్ మార్క్..!

మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టు కన్ఫామ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

వామ్మో.. మాళవిక నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

Big Stories

Advertisement
×