Samsung AC| కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారతదేశంలో తాజాగా కొత్త ఎయిర్ కండిషనర్ రేంజ్ లాంచ్ చేసింది. దీని పేరు బెస్పోక్ AI విండ్‌ఫ్రీ. ఈ 2026 బెస్పోక్ AI విండ్‌ఫ్రీ సిరీస్‌లో మొత్తం 23 మోడల్స్ ఉన్నాయి. వీటిని భారతీయ వాతావరణానికి సరిపడేలా డిజైన్ చేశారు. స్మార్ట్ కూలింగ్, కంఫర్ట్, ఎనర్జీ సేవింగ్‌పై దృష్టి పెట్టాయి. ఈ రేంజ్‌లో 4 స్టార్ రేటెడ్ ఏసీలు కూడా శాంసంగ్ జోడించింది. వివిధ బడ్జెట్, అవసరాలకు సరిపోయేలా తయారు చేశారు.
ఈ ఏసీలలో అడ్వాన్స్‌డ్ AI టెక్నాలజీ ఉంది. రూమ్ కండిషన్స్, యూజర్ హ్యాబిట్స్, ఇష్టమైన టెంపరేచర్‌ను రియల్ టైమ్‌లో అనలైజ్ చేస్తాయి. ఆ డేటా ఆధారంగా కూలింగ్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. కంఫర్ట్ మెరుగవుతుంది, అనవసర ఎనర్జీ వేస్టేట్ తగ్గుతుంది. మాన్యువల్ కంట్రోల్ అవసరం తగ్గుతుంది.
AI ఫాస్ట్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు రూమ్‌ను త్వరగా చల్లబరుస్తుంది. కావాల్సిన టెంపరేచర్ చేరుకున్న తర్వాత విండ్‌ఫ్రీ లేదా డ్రై కంఫర్ట్ మోడ్‌కు మారుతుంది. విండ్‌ఫ్రీ మోడ్ గాలిని మెత్తగా వ్యాప్తి చేస్తుంది. డైరెక్ట్ గాలి బాడీపై పడకుండా చేస్తుంది, చల్లదనం అసౌకర్యం తగ్గుతుంది.
శాంసంగ్ ప్రకారం ఈ ఏసీలు 30 శాతం వరకు తక్కువ కరెంటు వినియోగిస్తాయి. AI ఎనర్జీ మోడ్ ఉపయోగ ప్యాటర్న్స్ ఆధారంగా కంప్రెసర్ స్పీడ్ అడ్జస్ట్ చేస్తుంది. కూలింగ్ ఇంటెన్సిటీ, టెంపరేచర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. కంఫర్ట్‌తో పాటు విద్యుత్ బిల్లు తగ్గుతుంది. డ్రై కంఫర్ట్ టెక్నాలజీ తేమ ఉన్న వాతావరణంలో కూడా మెరుగైన కూలింగ్ ఇస్తుంది. గదిని మరీ చల్లగా చేయకుండా కేవలం తేమ తగ్గిస్తుంది.
ఈ ఏసీలు ప్రీమియం, మోడర్న్ డిజైన్‌తో వస్తాయి. స్టైలిష్ హోమ్ ఇంటీరియర్‌కు సరిపోతాయి. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. కంపాటిబుల్ స్మార్ట్ డివైస్‌ల ద్వారా సెట్టింగ్స్ కంట్రోల్ చేయవచ్చు. డైలీ యూస్‌కు మరింత సౌకర్యం జోడిస్తుంది.
శాంసంగ్ బెస్పోక్ AI విండ్‌ఫ్రీ ఏసీల ధరలు రూ.32,490 నుంచి ప్రారంభం. మేజర్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కూడా లిస్ట్ అయ్యాయి. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
Also Read: ఆపిల్ కంపెనీలో పనిచేసే భారతీయుడికి రూ.200 కోట్లకు పైగా వేతనం.. సిఈఓ సాలరీ ఎంతో తెలుసా?
శాంసంగ్ ఈ సిరీస్‌కు బలమైన వారంటీ ఇస్తోంది. ప్రతి ఏసీకి 5 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటీ ఉంది. ఇన్వర్టర్ కంప్రెసర్‌కు 10 సంవత్సరాల వారంటీ ఉంది. లాంగ్ టర్మ్ రిలయబిలిటీ, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది.
శాంసంగ్ స్మార్ట్ ఏసీ కూలింగ్ మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగాలని లక్ష్యంగా పెట్టుకుంది. బెస్పోక్ AI విండ్‌ఫ్రీ సిరీస్ కంఫర్ట్, ఇంటెలిజెంట్ ఫీచర్లు ఇస్తుంది. ఎనర్జీ సేవింగ్, ప్రీమియం డిజైన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. మోడర్న్ టెక్నాలజీ, తక్కువ పవర్ కన్సంప్షన్ కావాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్.