E-Paper
Advertisement

Carrot Juice Benefits: రోజూ ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగితే.. మొండి కొవ్వు కరగడమే కాదు, చర్మం కూడా మెరుస్తుంది!

Carrot Juice Benefits: రోజూ ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగితే.. మొండి కొవ్వు కరగడమే కాదు, చర్మం కూడా మెరుస్తుంది!
Advertisement

Carrot Juice Benefits: సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ విరివిగా దొరికే క్యారెట్ కేవలం వంటలకే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఈ క్యారెట్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని కూరలకే పరిమితం చేయకుండా.. క్యారెట్‌తో రోజూ ఓ గ్లాసు జ్యూస్‌ చేసుకుని తాగితే బరువు తగ్గాలనుకుంటున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. క్యారెట్‌లో తక్కువ కేలరీలు, జీరో ఫ్యాట్ ఉండటం వల్ల అన్ని వయసుల వారికీ ఇదొక పర్ఫెక్ట్ హెల్త్ డ్రింక్.

రోగనిరోధక శక్తి పెంపు:

క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలోకి వెళ్లాక విటమిన్ ‘ఏ’గా మారి.. రేచీకటి వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇది కేవలం కళ్లకే కాకుండా, దీనిలో ఉండే విటమిన్ ‘సి’ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా శరీరం బలంగా ఉంటుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

Advertisement

Also Read: పిల్లల కోసం హెల్దీ అండ్ టేస్టీ కోకోనట్ చాక్లెట్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!

ఈజీగా బరువు తగ్గొచ్చు:

అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి క్యారెట్ జ్యూస్ అద్భుతమైన డైట్ డ్రింక్. దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొద్దిగా తాగినా కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో అనవసరమైన చిరుతిళ్లపై మనసు మళ్లదు. అంతేకాదు.. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చూడటంలో క్యారెట్‌లోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.

జీర్ణసమస్యలు దరిచేరవు:

Advertisement

మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావాలంటే పీచు పదార్థం చాలా అవసరం. క్యారెట్ జ్యూస్‌లో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారించి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలను, విష పదార్థాలను తొలగించడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే, క్యారెట్‌లోని కాల్షియం, పొటాషియం దంతాలను, చిగుళ్లను దృఢంగా ఉంచుతాయి. అంతేకాదు.. మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన విటమిన్ ‘ఈ’ కూడా ఇందులో ఉంటుంది.

Also Read: బట్టతలపై జుట్టు మొలిపించే ఉల్లిపాయ రసం.. ఇంతకీ సైన్స్ ఏం చెబుతోందంటే?

Related News

కడుపు నిండా తిన్నా శరీరంలో శక్తి లేదా? మీరు చేసే తప్పులివే

కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతి విషయంలో తమ అభిప్రాయం చెబుతుంటారు

వయసు పెరిగినా శరీరంలో చరుకుదనం తగ్గదు.. డాక్టర్ సూచించిన ఈ 6 అలవాట్లు పాటిస్తే

మీరు ఇంట్లోనే RO వాటర్ తాగుతున్నారా? అది విషపూరితం కావొచ్చు.. ఈ 3 సంకేతాలు గుర్తించండి

ఒకేసారి ఎక్కువ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా? జాగ్రత్త ఈ కాంబినేషన్లు ప్రమాదకరం

80ల నాటి మన ఇళ్లలో దాగున్న అపురూపమైన జ్ఞాపకాలు.. ఇవి మీ ఇంట్లో ఇంకా ఉన్నాయా?

గోలీలు, బొంగరాలతో ఆటలు.. నేటి ఆన్‌లైన్ గేమ్స్‌లో ఆ కిక్కేది?

80’s కిడ్స్.. ఫ్యాషన్ ఐకాన్స్, రెట్రో అంటే గుర్తొచ్చేది వీళ్ల స్టైలే!

Big Stories

Advertisement
×