E-Paper
Advertisement

Curly Hair Care Tips: మీ రింగుల జుట్టును చూసి అందరూ కుళ్లుకోవాలా? అయితే ఈ సీక్రెట్స్ మీ కోసమే!

Curly Hair Care Tips: మీ రింగుల జుట్టును చూసి అందరూ కుళ్లుకోవాలా? అయితే ఈ సీక్రెట్స్ మీ కోసమే!
Advertisement

Curly Hair Care Tips: రింగుల జుట్టు అనేది ప్రకృతి ఇచ్చిన ఓ అద్భుతమైన వరం. నిజం చెప్పాలంటే, కర్లీ హెయిర్ ఉన్న అమ్మాయిలు ప్రత్యేకంగా హెయిర్ స్టైల్స్ కోసం గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ ఒత్తైన సుడులు ఇచ్చే స్టైల్ అండ్ కాన్ఫిడెన్సే వేరు. కానీ, ఈ అందమైన జుట్టును మెయింటెయిన్ చేయడం మాత్రం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. దీనికి తోడు మారుతున్న వాతావరణం, కాలుష్యం, కలుషిత నీరు వల్ల జుట్టు త్వరగా తేమను కోల్పోయి, చిక్కులు పడి.. నిర్జీవంగా తయారవుతుంటుంది. మరి మీ రింగుల జుట్టు ఎప్పుడూ సాఫ్ట్‌గా, షైనీగా ఉండాలంటే ఏం చేయాలి? నిపుణులు సూచిస్తున్న ఈ స్పెషల్ కేర్ టిప్స్ మీకోసమే..

సరిపడా నీళ్లు తాగాలి:

మనం తాగే నీరు మన చర్మంపైనే కాదు.. జుట్టు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. శరీరంలో తగినంత నీరు లేకపోతే జుట్టు వేగంగా పొడిబారుతుంది. అందుకే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. దీనితో పాటు, ప్రశాంతమైన నిద్ర కూడా జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది. కనీసం ఏడెనిమిది గంటల గాఢ నిద్ర వల్ల ఒత్తిడి తగ్గి, కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

Advertisement

Also Read: యవ్వనంగా కనిపించాలా? క్యాన్సర్ దరిచేరకూడదా? అయితే ఈ పింక్ పండును అస్సలు వదలకండి!

హెయిర్ సిరమ్ తప్పనిసరి:

బయటకు వెళ్లేటప్పుడు గాలిలోని దుమ్ము, ఎండ తీవ్రత నుంచి జుట్టును కాపాడుకోవడం ముఖ్యం. దీని కోసం స్కార్ఫ్ కట్టుకోవడం లేదా క్యాప్ ధరించాలి. జుట్టులోని సహజ తేమ ఆవిరైపోకుండా ఉండాలంటే తప్పకుండా ఈ టిప్స్ పాటించాల్సిందే. అలాగే.. అప్పుడప్పుడూ హెయిర్ సీరమ్‌ను కూడా అప్లై చేస్తుండాలి.

ఈ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయండి:

Advertisement

రింగుల జుట్టుకు కలబంద ఒక అద్భుతమైన వరమనే చెప్పాలి. వారానికి రెండుసార్లు కలబంద గుజ్జును కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత స్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. అదేవిధంగా, తేనె కూడా అద్భుతమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. మీరు ఉపయోగించే కండిషనర్ లేదా క్లెన్సర్‌లో కాస్త తేనె కలిపి వాడితే జుట్టు పొడిబారదు.

చివర్లు కత్తిరించాల్సిందే:

రింగుల జుట్టు ఉన్నవారికి చివర్లు చిట్లడం అనేది సర్వసాధారణ సమస్య. ఇది జుట్టును నిర్జీవంగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి.. ప్రతి మూడు నెలలకోసారి జుట్టు చివర్లను కొద్దిగా కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు చిక్కుబడకుండా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

Also Read: పిల్లల ఎత్తు పెరగాలంటే.. వెంటనే ఈ 5 ఆహారాలు ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోండి!

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×