BigTV English
Advertisement

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?
Health Tips: ఇల్లు పరిశుభ్రంగా ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తరచూ ఏదో ఒక వ్యాధి బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా వంటింట్లో మీరు వాడే ఒక వస్తువు మీ ఇంట్లో వారికి అధికంగా రోగాలను కలిగిస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది. వంటింట్లో ప్రతి ఒక్కరికి కిచెన్ ప్లాట్ ఫామ్, స్టవ్ ను తుడిచే స్పాంజ్ లేదా క్లాత్ ఉంటుంది. ప్రతిరోజూ దాన్ని శుభ్రం చేసి అక్కడే పెడతారు. నిజానికి దానిపై ఉండే బ్యాక్టీరియాల సంఖ్య చాలా ఎక్కువ. ఆ స్పాంజీ ఎన్నో రకాల ఫంగస్, క్రిములు, పురుగులు బ్యాక్టీరియాలకు నిలయమైపోతుంది. దాని వల్ల ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కొత్త అధ్యయనం చెబుతుంది.


కేవలం ఇంట్లో వాడే స్పాంజీ లేదా క్లీనింగ్ వస్త్రమే కాదు మీ ఇంట్లోని పరుపు కూడా మీకు రోగాల బారిన పడేలా చేస్తుంది. ప్రతిరోజూ పరుపుపై పడుకుంటే… ఆ పడుకున్న వ్యక్తి శరీరంలోని మృతకణాలు అక్కడే ఉండిపోతాయి. పరుపుల పైన దాదాపు ముప్పై శాతం చర్మ మృత కణాలే ఉంటాయని అధ్యయనం చెబుతోంది. అలాగే ఎన్నో రకాల సూక్ష్మక్రిములు కూడా ఉంటాయి. దుమ్ము, ధూళి, చెమట, సూక్ష్మ క్రిములు పరుపుకూ లేదా పరుపుపై ఉన్న దుప్పటికి అతుక్కుని ఉంటాయి. కానీ పరుపును సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శుభ్రం చేస్తారు. నిజానికి వారానికి రెండు మూడు సార్లు పరుపును ఎండలో పెట్టి వ్యాక్యూమ్ క్లీనర్ తో శుభ్రపరచవలసి ఉంటుంది. అలాగే పరుపుపై వాడే దుప్పట్లను ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మార్చాలి.

గిన్నెలు తోమే స్పాంజ్ పై కూడా విపరీతమైన బ్యాక్టీరియా ఉంటుంది. గిన్నెలు తోమాకా దాన్ని కూడా పరిశుభ్రంగా కడిగి ఎర్రటి ఎండలో ఆరబెట్టాలి. జర్మనీలో చేసిన ఒక అధ్యయనంలో సింకుపై ఉన్న బ్యాక్టీరియాల కన్నా స్పాంజీలపై ఉన్న క్రిములు, బ్యాక్టీరియాల సంఖ్య ఎక్కువ. దాదాపు 362 రకాల బ్యాక్టీరియాలు ఈ గిన్నెలతోమే బ్రష్ పై ఉంటాయని అధ్యయనం చెబుతోంది. కాబట్టి ప్రతిరోజూ గిన్నెలతో పాటు గిన్నెల తోమే స్పాంజీ లేదా బ్రష్ ను కూడా ఎర్రటి ఎండలో ఆరబెట్టాలి. అప్పుడే ఆ బాక్టీరియాలు వదులుతాయి.


మనకి తెలియకుండానే మన ఇళ్లల్లో వాడే ఈ వస్తువులు మనకు తీవ్ర అనారోగ్యాలు వచ్చేలా చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. పరుపును, దుప్పట్లను, తువ్వాళ్లను తరచూ ఉతికి ఆరబెడుతూ ఉండాలి. అలాగే గిన్నెలతోమే బ్రష్ లు, స్పాంజీలను కూడా ప్రతిరోజూ ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేస్తేనే వైరస్, బ్యాక్టీరియా వల్ల మన శరీరంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉంటుంది. లేకుంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం పెరిగిపోతుంది.

మీ ఇంట్లో మీ పిల్లలు, పెద్దలు తరచూ వ్యాధుల బారిన పడుతున్న జలుబు, జ్వరం, దగ్గు వంటి వాటికి గురవుతున్నా మీ ఇంట్లో పరిశుభ్రత లోపించిందేమో అని ఒకసారి చెక్ చేసుకోండి. వాటి వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎక్కువగా వాడే వస్తువులను తరచూ మారుస్తూ ఉండండి. అప్పుడే ఎలాంటి రోగాలు మీకు రాకుండా ఉంటాయి.

Related News

Jamun Seed Powder: నేరేడు విత్త‌నాల పొడిని ఇలా వాడారంటే.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే!

Perfume in car: కారులో పెర్ఫ్యూమ్ వాడడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఇప్పుడే తీసి పడేస్తారు

Water: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగే.. అలవాటు మీలో ఉందా ?

Blue number Plates: ఏ వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్లు ఉంటాయి? 99 శాతం మందికి తెలియదు

Parenting Tips: మీ పిల్లలు అన్నింట్లో ముందుండాలా ? ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి !

Coffee Face Mask: కాఫీ ఫేస్ మాస్క్‌తో.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Vertigo Problem: రోజూ నిద్రలేవగానే తల గిర్రుమంటోందా.. వర్టిగో గురించి తెలియాల్సిన సమయమిదే!

 Ajwain Seed Water: వాము నీరు తాగితే.. నమ్మలేనన్ని లాభాలు !

Big Stories

×