E-Paper
Advertisement

గురుడ పురాణంలో శిక్షలే కాదు.. మూడు సూత్రాలు మీ అదృష్టాన్ని మారుస్తాయి, అవేంటో తెలుసా?

గురుడ పురాణంలో శిక్షలే కాదు.. మూడు సూత్రాలు మీ అదృష్టాన్ని మారుస్తాయి, అవేంటో తెలుసా?
Advertisement

Garuda Puranam: గరుడ పురాణం ఏ పేరు చెబితే చాలు చాలామంది భయ పడిపోతారు. ఎందుకంటే అందులోని కేవలం వ్యక్తుల మరణం తర్వాత పడే శిక్షల గురించి వివరిస్తారని కొందరు చెబుతారు. వాటి గురించే కాదు.. మన అదృష్టాన్ని మార్చే సూత్రాలు ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసా? మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువెత్తాలంటే ఆ మూడింటి గురించి తెలుసుకుందాం!

గురుడ పురాణంలో అదృష్టాన్ని మార్చే మూడు సూత్రాలు- సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన ఇతిహాసంగా గరుడ పురాణాన్ని పరిగణిస్తారు పండితులు. వ్యక్తుల మరణం తర్వాత స్థితి గురించి వర్ణించడమే కాదు. మానవులకు సరైన జీవన విధానం, నైతిక విలువలు, కర్తవ్యం- విజయాన్ని సాధించడానికి తిరుగులేని సూత్రాలను బోధిస్తోంది.  గరుడ పురాణంలో పేర్కొన్న కొన్ని నియమాలను వ్యక్తులు తన జీవితంలో పాటిస్తే, అదృష్టం తలుపు తడుతుంది. ఇంట్లో ఎల్లప్పుడూ సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ విషయాన్ని ఆచార్యులు, పండితులు నమ్ముతారు.. చెబుతారు కూడా. గరుడ పురాణంలో వర్ణించిన మూడు ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం.

Advertisement

అన్నదానం చేయడం- హిందూ మతంలో అన్నదానం చేయడం ఒక గొప్ప దానంగా పరిగణిస్తారు. తమ శక్తి మేరకు పేదలు, నిస్సహాయులకు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే పేదరికం నుండి విముక్తి పొందుతారు. అన్నదానం చేయడం వల్ల ఇంట్లో అన్నపూర్ణా దేవి-లక్ష్మీ దేవి ఆశీస్సులు నిరంతరం ఉంటాయి. ఆ విధంగా చేయడం వల్ల ఆశీస్సులు లభించడమే కాదు, కుటుంబానికి శ్రేయస్సు కూడా కలుగుతుంది.

గోమాతకు సేవ- సనాతన సంస్కృతిలో ఆవును గోమాతగా, సకల దేవతల నివాసంగా పరిగణిస్తారు. ఇంట్లో రొట్టెలు చేసినప్పుడు మొదటి రొట్టెను ఆవు కోసం తొలుత తీయాలి. అంతేకాకుండా వాటికి క్రమం తప్పకుండా ఆహారం పెట్టడం, సేవ చేయడం అత్యంత శుభప్రదం. ఇలా చేయడం వల్ల వ్యక్తి జాతకంలో వివిధ గ్రహ దోషాలు శాంతిస్తాయి. ప్రతికూల శక్తి తొలగిపోయి, జీవితంలో సానుకూలత- విజయానికి మార్గం తెరుచుకుంటాయి.

Advertisement

ALSO READ: అర్ధరాత్రి రాత్రి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన 100 కుటుంబాలు.. అసలు ఏం జరిగింది?

పూర్వీకులను గౌరవించడం- మన పూర్వీకులు మన కుటుంబానికి బలమైన పునాది. పూర్వీకులను గౌరవించి వారికి పుట్టిన రోజు భక్తిశ్రద్ధలతో తర్పణం, పిండ దానం, దానధర్మాలు చేసేవారు వారి నుంచి ఆశీస్సులు పొందుతారు. అంతేకాదు కుటుంబంలోని కలహాలను, సమస్యలను శాంతింపజేసి, వంశాభివృద్ధికి దోహదపడతారు. ఆ విధంగా కుటుంబంలో శాశ్వతమైన ఆనందం, శాంతి, శ్రేయస్సు నిర్ధారిస్తుంది గురుడ పురాణం.

Related News

అర్ధరాత్రి రాత్రి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన 100 కుటుంబాలు.. అసలు ఏం జరిగింది?

స్వార్థపరులు, నిజమైన స్నేహితుల మధ్య తేడా ఏంటి? ఈ లక్షణాలతో గుర్తించాలి

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉండదు.. ఏది ఎంత కాలం నిల్వ చేయాలి?

ఇద్దరి మధ్య చిచ్చు పెడతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న విషయానికి పెద్ద గొడవ చేస్తారు

టీతో పాటు బిస్కెట్ తినే అలవాటు ఉందా? వర్షాకాలంలో ఈ ఆరోగ్య సమస్యలకు కారణం అదే

గర్ల్‌ఫ్రెండ్ లేదా దొంగచాటుగా సిగరెట్ తాగడం.. తల్లిదండ్రులతో టీనేజ్ పిల్లలు ఈ 6 విషయాలు దాచిపెడతారు

హై బీపీ వృద్ధాప్యంలో మాత్రమే వస్తుందని అనుకుంటే పొరపాటు.. డాక్టర్లు చెప్పిన కారణాలు ఇవే

Big Stories

Advertisement
×