BigTV English

Garlic Peels Benefits: వెల్లుల్లి తొక్కలను పడేస్తున్నారా.. వీటి ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Garlic Peels Benefits: వెల్లుల్లి తొక్కలను పడేస్తున్నారా.. వీటి ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Do you Still Throw Garlic Peels Away Don’t do That Anymore: వెల్లుల్లి వల్లన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలుసు.. వీటిని ఆయుర్వేద ఔషదంగా, వంటల్లోను అనేర రకాలుగా ఉపయోగిస్తుంటారు. కానీ వెల్లుల్లి తొక్కల్ని మాత్రం పనికిరావని మీరు పారేస్తుంటారు. అయితే ఇక నుంచి తెలుసుకోండి.. వెల్లుల్లిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో వెల్లుల్లి తొక్కలో కూడా అన్ని ఔషద గుణాలు ఉన్నాయట.


వెల్లుల్లి తొక్కలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరుచూ వాడటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటి ప్రయోజనాలు ఏంటో తెలిస్తే అస్సులు వదిలుపెట్టరు. వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..

ఆస్తమాతో బాధపడేవారు వెల్లుల్లి తొక్కలను తీసుకుంటే.. ఆస్తమా నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీటిని ఎలా తీసుకోవాలంటే వెల్లుల్లి తొక్కలను మెత్తగా పొడి చేసి ఉదయం, సాయత్రం తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


చర్మ సమస్యలను తొలగిస్తుంది.
చర్మంపై మచ్చలు, దురద, తామర వంటి సమస్యలతో బాధపడే వారు వెల్లుల్లి తొక్కలను నీటిలో కొన్ని గంటలు నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసుకొని సమస్య ఉన్నదగ్గర అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉంటే యాంటీ యాంటీ బాక్టీరియల్ కణాలు చాలా ప్రభావితం చూపిస్తాయి. అంతే కాకుండా చికాకు నుంచి ఉపశమనం లభిస్తుంది.

పాదాల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి తొక్కలు పాదాల నొప్పుల నుంచి రిలీఫ్ ని ఇస్తాయి. వెల్లుల్లి పీల్స్ ను కొంచెంసేపు నీటిలో మరిగించి గోరువెచ్చటి నీటిలో పాదాలు కొంచెం సేపు ఉంచితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: చెమటలు పడితే మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?

కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది.
వెల్లుల్లి తొక్కను పొడి చేసుకొని గోరు వెచ్చటి నీటిలో కలుపుకొని ఖాళీ కడుపుతో ఉదయాన్నే తాగితే కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. అంతే కాదు గుండెకు కూడా చాలా మంచిది.

జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయుడుతుంది.
వెల్లుల్లి తొక్కలను గోరువెచ్చని నీటిలో వేసి కొంత సమయం తర్వాత ఆ వాటర్ ను జుట్టుకు పట్టిస్తే సాధారణ జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాదు చుండ్రు, దురద సమస్యల నుండి కూడా రిలీఫ్ ను ఇస్తాయి.

ఆహారం పదార్దాలలో వెల్లుల్లి తొక్కలను ఉపయోగించడం
వెల్లుల్లి తొక్కలను సూప్ రూపంలో ఉపయోగించవచ్చు. వీటిని బిర్యాని, ఫ్రైడ్ రైస్‌ వంటి ఆహారపదార్ధాలలో పొడి రూపంలో ఉపయోగించవచ్చు.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×